శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: బుధవారం, 23 నవంబరు 2016 (15:04 IST)

అక్కినేని అఖిల్‌కు అమ్మగా టబు నటిస్తుందా...?

అక్కినేని నాగార్జున సినిమాల్లో టబు పలు చిత్రాల్లో నటించింది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వుండేదని అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వచ్చాయి. ఇద్దరు చాలా చనువుగా వుండేవారని ప్రతీతి. అలాంటి టబు బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడ కొద్దికాలం గ్యాప్

అక్కినేని నాగార్జున సినిమాల్లో టబు పలు చిత్రాల్లో నటించింది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వుండేదని అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వచ్చాయి. ఇద్దరు చాలా చనువుగా వుండేవారని ప్రతీతి. అలాంటి టబు బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడ కొద్దికాలం గ్యాప్‌ కూడా తీసుకుంది. కాగా, మరలా తెలుగులో రావడానికి రంగం సిద్ధమయింది. 
 
ఇందుకు అక్కినేని నాగార్జున తీసుకున్న కేర్‌ అని వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా అఖిల్‌ కథానాయకుడిగా నటించనున్న సినిమాలో ఆమె ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు అమ్మగా నటిస్తుందా లేదా అనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. పాత్ర పేరు చెప్పడానికి చిత్ర యూనిట్‌ నిరాకరిస్తుంది. ఈ చిత్రానికి మనం దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం  వహిస్తున్నారు.