బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (14:34 IST)

గుంటూరు నుంచి పోటీ చేయనున్న నందమూరి తారక్.. నెలరోజులుగా అక్కడే మకాం..

నందమూరి కుటుంబానికి చెందిన మరో హీరో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో గుప్పుమంటున్నాయి. ఇందుకోసం ఆ యువ హీరో గత కొంతకాలంగా ఏకంగా అక్కడే మకాం వేసి తెలుగు యువత నేతలతో చర్చలపై చర్చలు

నందమూరి కుటుంబానికి చెందిన మరో హీరో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో గుప్పుమంటున్నాయి. ఇందుకోసం ఆ యువ హీరో గత కొంతకాలంగా ఏకంగా అక్కడే మకాం వేసి తెలుగు యువత నేతలతో చర్చలపై చర్చలు జరుపుతున్నారు. ఆ యువ హీరో ఎవరో కాదు నందమూరి తారక్ (తారకరత్న). జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు.
 
గత కొంతకాలంగా అవకాశాలు లేకపోవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తారక్... రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయన ఇటీవలి కాలంలో ఎపుడు చూసినా గుంటూరులోనే మకాం వేసి అక్కడ తెలుగు యువత నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 
 
దాదాపు నెల రోజులుగా గుంటూరులోనే ఉంటూ రోజూ రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నాడట.. 2019 లో జరిగే ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ నుంచి పోటీ చేయాలని తారక్ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన ఎన్ని రకాల సమావేశాలు నిర్వహించినా వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ టిక్కెట్ ఇస్తుందో లేదేదో వేచి చూడాల్సిందే.