గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2015 (20:09 IST)

తరుణ్‌కు హీరోయిన్లు దొరకడం లేదట...

తరుణ్‌ చాలామంది హీరోయిన్లతో నటించేశాడు. ప్రస్తుతం గ్యాప్‌ తీసుకున్నా... ఎవ్వరూ తన పన్కన నటించకపోవడంతో.. కొత్త అమ్మాయి కోసం అన్వేషించాడు. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్న ఒవియా హెలెన్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇందుకోసం చాలా కసరత్తే చేశాడు. ఎంతోమందిని పరిశీలించాడు. రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అభిరామ్‌ సమర్పణలో రమేష్‌ గోపి దర్శకత్వంలో ఎస్‌.వి.ప్రకాష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒవియా హెలెన్‌ హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ అయింది. 
 
గ్లామరస్‌ హీరోయిన్‌గా ఇప్పటికే ఇతర భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న ఒవియా తెలుగు ప్రేక్షకుల్ని తన గ్లామర్‌తో అలరించడానికి త్వరలో రాబోతోంది. అక్టోబర్‌ 10 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఉడిపి, కూర్గ్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకునే ఈ చిత్రంలో 6 పాటలు వున్నాయి.
 
ఇందులో రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత ప్రకాష్‌. అయితే ఈ చిత్రంలో హీరోహీరోయిన్లపై 90 శాతం షాట్స్‌ వుంటాయట. సపోర్టింగ్‌ ఆర్టిస్టులు చాలా పరిమితమని తరుణ్‌ చెప్పాడు. మరి సినిమా అంతా ఎలా తీస్తాడో చూడాల్సిందే.