గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By IVR
Last Modified: ఆదివారం, 23 నవంబరు 2014 (17:36 IST)

పాపం రణభీర్... అర్పిత ఖాన్ రెండాకులు సల్మాన్, కత్రినాలపై...

ప్చ్... పాపం రణభీర్ కపూర్ అంటున్నారు బాలీవుడ్ జనం. అదేంటయా అంటే, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ ఎఫైర్ రణ్ భీర్ కపూర్, కత్రినా కైఫ్ మధ్య అని అంతా అనుకునేవారు. కానీ ఈ సీన్ రివర్స్ అయ్యే సంఘటన జరిగిందట. దాన్నిబట్టి కత్రినాకైఫ్ పెళ్ళి, రణ్ భీర్ కపూర్ కాదని తేలిపోయిందని చెప్పుకుంటున్నారు. 
 
పంజాబీ సంప్రదాయమైన కలీరా అనే కార్యక్రమంలో కొత్తగా పెళ్లయిన నూతన వధువు చేతినిండా ఎరుపుతెలుపు గాజులు వేసుకుని, వాటికి ఓ ఆభరణాన్ని కట్టుకుని అవివాహితుల తల మీద తన చేతిని అటూఇటూ ఊపితుందట. అలా ఊపినప్పుడు ఆ ఆభరణంలో ఉన్న నూలు పోగు లేదంటే ఆకు ఎవరి తల మీద పడితే వారికి వెంటనే పెళ్లయిపోతుందట. 
 
సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లిలో ఈ తరహా ఆశ్వీరచనాలను ఆమె కత్రినాకైఫ్, సల్మాన్ లకు అందించిందట. ఈ వేడుకలో అర్పితా తన చేతులను ఊపగానే ఓ ఆకు వెళ్లి కత్రినా నెత్తి మీద, మరో ఆకు వెళ్లి సల్మాన్ నెత్తి మీద పడ్డాయట. అంతే... అక్కడున్నవారంతా కత్రినాకైఫ్, సల్మాన్ ఖాన్ ల పెళ్ళి త్వరలో జరిగిపోతుందని తెగ చెప్పుకున్నారట. మరి రణభీర్ కు ఈ విషయం తెలిస్తే ఏమవుతాడో...?!!