మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (09:57 IST)

సినిమా ప్రచారం కోసం చీపుర్లు పట్టిన ప్రఖ్యాత నటులు

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తున్న చిత్రం 'ఎ ఫ్లయింగ్‌ జాట్‌'. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రెమోడెసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గుడ్‌ వర్సెస్‌ ఈవిల్‌ థీమ్‌తో ఈ సినిమా తెరకెక్క

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తున్న చిత్రం 'ఎ ఫ్లయింగ్‌ జాట్‌'. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రెమోడెసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గుడ్‌ వర్సెస్‌ ఈవిల్‌ థీమ్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హాలీవుడ్‌ నటుడు నాథన్‌ జోన్స్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. టైగర్‌ ష్రాఫ్‌కి జంటగా జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ నటిస్తోంది. 
 
కాగా ఈ మధ్య బాలీవుడ్‌‌లో సినిమాల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనికోసం నటీనటులు వినూత్నమైన పనులు చేపట్టి అందరి దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌లు హాలీవుడ్‌ నటుడు నాథన్‌ జోన్స్‌తో కలిసి ఈ సినిమా ప్రచారం కోసం చీపుర్లు చేత పట్టుకుని ముంబైలోని వెలింగ్కర్‌ ఇన్సిట్యూట్‌ వద్ద ఉన్న రోడ్డను మూకుమ్మడిగా ఊడ్చారు. త్వరలోనే ఈ సినిమాని విడుదలచేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.