Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ హీరో - డైరెక్టర్ - హీరోయిన్ అరెస్టు తప్పదంటున్న సిట్ వర్గాలు

ఆదివారం, 16 జులై 2017 (10:18 IST)

Widgets Magazine
drug bag

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసును తవ్వుతున్నకొద్దీ పలువురు సెలెబ్రిటీల పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసులో ఓ ప్రముఖ హీరో, దర్శకుడు, హీరోయిన్‌ల అరెస్ట్ తప్పదని సిట్ వర్గాలు చెబుతున్నాయి. 
 
ఇప్పటివరకూ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో వీరు ముగ్గురి చుట్టూనే ఉచ్చు బిగిస్తోంది. మిగతా వారంతా కేవలం కస్టమర్లుగా మాత్రమే ఉన్నారని, వీరు మాత్రం ఎంతో మందికి తమ చేతుల మీదుగా డ్రగ్స్ సరఫరా చేశారని సిట్ వర్గాలు గుర్తించాయి.
 
డ్రగ్స్‌కు అలవాటుపడి కస్టమర్లుగా ఉన్న వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తున్న పోలీసులు, మరొకరికి మత్తుమందులు సరఫరా చేసిన వారిని మాత్రం వదిలేది లేదని చెబుతున్నాయి. కస్టమర్లుగా ఉన్న వారిని ప్రశ్నించి, వారికి కౌన్సెలింగ్ ఇప్పించి, ఈ దందాకు, మత్తుమందుల వాడకానికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తామన్నారు. 
 
కానీ, డ్రగ్స్‌ను సరఫరా చేసిన ఆ ముగ్గురినీ మాత్రం అరెస్ట్ చేయక తప్పదని అంటున్నాయి. రెండు మూడు రోజుల్లో వీరి ప్రమేయంపై మరిన్ని ఆధారాలు లభిస్తాయని, ఆపైనే వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో నోటీసులు అందుకున్న వారిలో ఈ ముగ్గురూ ఎవరన్న విషయమై అందరిలో ఆందోళన నెలకొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డ్రగ్స్ కేసులో హాట్ యాంకర్, సెక్సీ హీరోయిన్...

డ్రగ్స్ వ్యవహారంలో కేవలం 8 మంది సినీప్రముఖుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. అయితే మరో ...

news

ఎన్టీఆర్-మహేష్ బాబుతో రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ...

news

రాఘవేంద్రరావుకు తాప్సీ సారీ చెప్పేసింది.. ఆనందో బ్రహ్మ టీజర్‌ వచ్చేస్తోంది..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై వివాదాస్పద కామెంట్లు చేసిన తాప్సీ వెనక్కి తగ్గింది. ...

news

శివగామి పాత్ర రమ్యకృష్ణకే రాసి పెట్టి వుంది..ఆ పాత్రలో రమ్య జీవించింది: మధుబాల

''అల్లరిప్రియుడు" సినిమాలో రమ్యకృష్ణతో కలిసి నటించిన మధుబాల గుర్తుందా? ఈమె 'రోజా' ...

Widgets Magazine