Widgets Magazine

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్: రవితేజ, నవదీప్, ఛార్మీ, ముమైత్, పూరీలకు ఎక్సైజ్ నోటీసులు?

శుక్రవారం, 14 జులై 2017 (10:30 IST)

Widgets Magazine

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌ జోగుతుంది. ఆ మత్తును వదిలించేందుకు హైదరాబాదు పోలీసులు కార్యాచరణ మొదలెట్టారు. డ్రగ్స్‌ కేసు గుట్టు విప్పేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెడీ అయ్యింది. కాల్ లిస్ట్ కదిలించే కొద్దీ ప్రముఖుల పేర్లంతా వెలుగులోకి వస్తున్నాయి. దర్శకులు మొదలుకొని.. ఆర్టిస్టుల దాకా డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్నారని తేలింది. ముఠాలో కొందరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ డ్రగ్స్ కేసులో ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ చెప్తున్నారు. 
 
ఇప్పటికే ఈ కేసులో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి యూనిట్ల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల డ్రగ్స్‌ రాకెట్‌‌లో దొరికిన నిందితుల కాల్‌ డేటాను అనేక మంది పేర్లు బయటపడ్డాయి. పక్కా ఆధారాల ప్రకారం కాల్ డేటాలో ఉన్న సినిమా ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. వాళ్లంతా  ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో టాస్క్‌ ఫోర్స్‌ ముందు హాజరుకావాలని ఆదేశించారు. అయితే సినిమా రంగానికి చెందిన వారిని డ్రగ్స్‌ ముఠా వాడుకున్నదా.. లేదా  నేరుగా  సంబంధాలు ఉన్నాయా  అనేది విచారణలో తేలుతుందన్నారు. 
 
ఎక్సైజ్ శాఖ నోటీసులు అందిన వారిలో హీరోలు రవితేజ, నవదీప్, తరుణ్, తనీష్, నందు, దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కె, ఛార్మీ, ముమైతా ఖాన్, ఆర్ట్ డైరక్టర్ చిన్నా సుబ్బరావు, రవితేజ డ్రైవర్లు ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ నటి పేరును దాచిపెట్టకండి.. పేరును పేర్కొనడంలో తప్పేమీ లేదు: కమల్

మలయాళ నటి భావన కిడ్నాప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు ...

news

దిలీప్ అరెస్టుతో అందరిలాగానే నేను కూడా షాకయ్యా.. నేరం చేస్తే శిక్ష తప్పదు: భావన

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరిలాగానే తాను ...

news

నిద్రపట్టక వరుణ్‌కి, అమ్మకి చెప్పే మాత్రలు మింగాను.. ఆత్మహత్య అంటారా. వాపోయిన వితిక

నిద్రపట్టకపోతే స్లీపింగ్‌ టాబ్లెట్స్‌ తీసుకున్నా. ఆ టాబ్లెట్స్‌ వల్ల ఓ పదీ పన్నెండు గంటలు ...

news

ఈ ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నాయి కదా.. నేనే దొరికానంట్రా మీకు... తెల్లమ్మాయి ఫైర్

పుకార్లకు కొత్త నిర్వనమిచ్చి మెరుపువేగంతో ప్రపంచమంతా పాకిస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు ఆ ...