శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (09:38 IST)

సూపర్ స్టార్‌తో త్రిష స్టెప్స్?

సూపర్ స్టార్‌తో త్రిష స్టెప్స్?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించాలని ప్రతి హీరోయిన్ ఆశ పడుతుంది. హీరోయిన్‌గా కాకపోయినా కనీసం సింగిల్‌సాంగ్‌లో నైనా నటించే అవకాశం కోసం వెంపర్లాడుతుంటారు. అలాంటి ఆకాంక్ష నటి త్రిషకు ఉంది.

తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ బ్యూటీకి ఇప్పటి వరకు సూపర్‌స్టార్‌తో కలసి నటించే అవకాశం రాలేదు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది కూడాను.
 
అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లింగా చిత్రంలో త్రిషకు ఛాన్స్ చిక్కినట్టు సమాచారం. అదీ హీరోయిన్‌గా కాదు ఒక్క పాటలో రజనీతో ఆడే అవకాశం అట. లింగా చిత్రంలో ఈ సాంగ్ ప్రత్యేకంగా ఉంటుందట.  ఇదే గనుక నిజమైతే త్రిష వాంఛ నెరవేరినట్లే. ఇక ఆమె సంతోషానికి అవదులుండవు.
 
సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న లింగా చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుంది.