గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 13 డిశెంబరు 2014 (15:38 IST)

వరుణ్ గురించి చెప్పాలా.. ఇంకా టైముందిలెండి!: త్రిష

త్రిష గడుగ్గాయి. త్రిష ఇంకా అసలు విషయాన్ని దాస్తూనేవుంది. తనకు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంటూ కోలీవుడ్‌లో బాగా ప్రచారం సాగతున్నా... అమ్మడు వరుణ్‌తో కలిసి ఢిల్లీ, ఆగ్రా లాంటి ప్రాంతాలకు లవ్ టూర్ వెళ్లొచ్చినా.. అసలు విషయాన్ని మాత్రం చెప్పేందుకు దాటవేస్తోంది.
 
వరుణ్ గురించి చెప్పండి అంటూ విలేకరులు అడిగితే.. అందుకు ఇంకా టైముందని చెప్పేస్తుంది."అతనితో నాకు ఫ్రెండ్ షిప్ వుంది. అయితే, వరుణ్ గురించి చెప్పాలంటే మాత్రం కొన్నాళ్ళు ఆగాలి.
 
ప్రస్తుతానికి ఆ విషయం గురించి ఏమీ చెప్పలేను. నాకంటూ మంచి విషయం జరిగే సందర్భం వచ్చినప్పుడు నేనే పిలిచి చెబుతాను" అంటూ త్రిష వెల్లడించింది. మరి వరుణ్ గురించి ఎప్పుడు చెబుతోందో.. అమ్మడు మాటలను ఎలా అర్థం చేసుకుంటారో ఇక మీ ఇష్టం.