శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:28 IST)

వరుణ్‌సందేశ్‌ బిజీ అయ్యాడట..

'హ్యాపీడేస్‌'లో గ్రూప్‌లో ఒకడిగా నటించిన వరుణ్‌సందేశ్‌.. 'కొత్తబంగారులోకం' తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత సహనటిని వికితను పెండ్లిచేసుకుని.. కాస్త సినిమాలకు

'హ్యాపీడేస్‌'లో గ్రూప్‌లో ఒకడిగా నటించిన వరుణ్‌సందేశ్‌.. 'కొత్తబంగారులోకం' తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత సహనటిని వికితను పెండ్లిచేసుకుని.. కాస్త సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు నటుడిగా తన సత్తాను చాటేందుకు ముందుకు వస్తున్నాడు. 
 
తాజాగా ప్రియాంక భరద్వాజ్‌తో కలిసి 'మిస్టర్‌ 420' సినిమా చేశాడు. ఎస్‌ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గజ్జల హరికుమార్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. యేడాది నుంచి బయటపడాలనుకున్న ఈ సినిమాను ఈనెల 30న విడుదల చేస్తున్నారు. 
 
ఈ సినిమాకు ముస్తాఫా చక్కటి సంగీతాన్ని అందించాడనీ... ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేసే తనకు ఓ వ్యక్తి పరిచయంతో జీవితం మారిపోతుందని.. ఇదే సినిమా కథని తెలిపాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాననీ.. అందులో ఒకటి రైతు పాత్ర వేస్తున్నానని చెప్పాడు.