గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 మే 2016 (18:48 IST)

రీ ఎంట్రీ కోసం విజయశాంతి గ్రౌండ్ వర్క్.. 'ఒసేయ్ రాములమ్మ' సీక్వెల్‌తో...

విజయశాంతి. ఒకపుడు సినిమారంగంలో మకుటం లేని మహారాణిగా వెలిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి... మాటల తూటాలు పేల్చి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. రాజకీయాల్లో ఎంత వేగంగా పైకి వచ్చిందో అంతే వేగంగా అధఃపాతాళానికి పోయారు. అలాంటి రాములమ్మ ఇపుడు మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అదీ కూడా తన సినీ ఇమేజ్‌ను అమాంతం పెంచేసిన 'ఒసేయ్ రాములమ్మ' చిత్రం సీక్వెల్‌తోనే వెండితెరపై కనిపించాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇందుకోసం గత కొన్ని రోజులుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట! సినిమాలలో స్లిమ్‌గా కనిపించడానికి అవసరమైన కసరత్తులు చేస్తున్నారట! ఒసేయ్ రాములమ్మ సినిమాకు సీక్వెల్‌గా సినిమా తీసేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ను పూర్తి చేసినట్టు వినికిడి. 
 
ఈ సినిమాతో మళ్లీ తన దశ తిరిగిపోతుందనే గట్టి అభిప్రాయంతో ఆమె ఉన్నారు. పైగా, మాస్‌లో ఇమేజ్‌ను పెంచే సినిమా అయితేనే తన పొలిటికల్‌ కెరీర్‌ మలుపు తిరుగుతుందనే నమ్మకంతో ముందుకు సాగాలని గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఒసేయ్ రాములమ్మతో పాటు.. మరో భారీ ప్రాజెక్టును ఈ మెదక్ మాజీ ఎంపీ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.