శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (15:19 IST)

ట్వీట్ చేసి తన లవ్ మ్యాటర్ పబ్లిక్ చేసిన కోలీవుడ్ హీరో...

తెలుగువాడైన హీరో విశాల్ కోలీవుడ్‌లోనే ముందు స్టార్ హీరో అయ్యాడు. కోలీవుడ్‌లో అక్క‌డ ఏకంగా న‌డిగ‌ర్ సంఘం ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తూ త‌మిళ హీరోల‌కు ధీటుగా ఎదిగాడు. అంతేకాదు నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చ

తెలుగువాడైన హీరో విశాల్ కోలీవుడ్‌లోనే ముందు స్టార్ హీరో అయ్యాడు. కోలీవుడ్‌లో అక్క‌డ ఏకంగా న‌డిగ‌ర్ సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి త‌మిళ హీరోల‌కే ఓ సవాల్ విసిరాడు. అంతేకాదు నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమేకాకుండా, పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒక పక్క కథానాయకుడిగా యాక్ష‌న్ సినిమాలు చేసుకుంటూ... మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోను విశాల్ చురుకుగా పాల్గొంటూ ఉన్నాడు. 
 
కోలీవుడ్‌లో ఈ హీరోకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేసమయంలో వివాదాస్పదుడిగా... రోజుకో కామెంట్‌తో విశాల్ వార్తల్లో నిలుస్తున్నాడు. కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ ప్రేమ విషయాన్ని నిజం చేసే విధంగా విశాల్ .. వరలక్ష్మితో కలిసి దిగిన ఒక ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 
 
అంతే కాదు ''ఈ ఫోటో అన్ని ప్రశ్నలకి సమాధానం చెబుతుంది'' అనే కామెంట్‌ను కూడా రాశాడు. అయితే, ఈ ప్రేమ వ్యవహారంపై శరత్ కుమార్ మాత్రం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ కారణంగానే శరత్ కుమార్.. విశాల్ మధ్య గొడవలు నడుస్తున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాల్ ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ.. కామెంట్ రాయడం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.