శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 ఆగస్టు 2014 (14:31 IST)

లిప్ లాక్... హీరోల్లో కమల్... హీరోయిన్లలో లక్ష్మీ మీనన్

లిప్ లాక్... పెదవులపై పెదవులను కలుపుతూ చుంబించడం అనేది ఇదివరకటి సినిమాల్లో ఓ సంచలనంగా ఉండేది. ఇప్పుడా సీన్ రివర్స్‌గా ఉన్నట్లు కనబడుతోంది. హీరోయిన్లు అడిగి మరీ లిప్ లాక్ సన్నివేశాలను పెట్టించుకుంటున్నారట. కొందరైతే ఈ సీన్లు ఉన్నాయా లేదా అని వాకబు చేస్తున్నారట. తమిళ నటి లక్ష్మీ మీనన్ రెండాకులు ఎక్కువే చదివింది ఈ విషయంలో.
 
తను నటించే చిత్రాల్లో ప్రత్యేకించి రొమాంటిక్ సన్నివేశాలు కావాలంటూ ఆమె నానా యాగీ చేస్తోందట. దర్శకుల వద్ద, హీరోల వద్ద ఈ విషయంపై చర్చిస్తోందట. కొందరు హీరోలు లిప్‌లాక్ వద్దని చెపుతున్నా.... సినిమాలో కిక్ కోసం లిప్ లాక్ తప్పదంటూ వారిని బతిమాలి ఒప్పిస్తుందట. లిప్ లాక్ హీరోయిన్లు కూడా మొదలవుతున్నారన్నమాట. అన్నట్లు హీరోల్లో లిప్ లాక్ అనగానే కమల్ హాసన్ గుర్తుకువస్తాడు. హీరోయిన్లలో ఇక లక్ష్మీ మీనన్ గుర్తొస్తుందన్నమాట.