Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ. 500 కోట్ల లక్ష్యం దిశగా బాహుబలి-2: ముంబైలో కరణ్ జోహార్ పార్టీలే పార్టీలు

హైదరాబాద్, బుధవారం, 17 మే 2017 (02:41 IST)

Widgets Magazine
prabhas - rajamouli

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ప్రతిష్ఠాత్మక చిత్రం ది కంక్లూజన్ జాతీయ, అంతర్జాతీయ బాక్సాఫీస్‌లో చిరకాలంగా ఉన్న రికార్డులన్నింటినీ చెరిపివేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్త వసూళ్లు రూ. 1500 కోట్లకు చేరవువుతుండగా, హిందీ వెర్షన్ సోమవారం కూడా 8 కోట్లు వసూలు చేసి షాక్ తెప్పించింది. మూడో వారాంతంలో టికెట్ కలెక్షన్ల పరంగా శుక్ర, శని, ఆది వారాల్లో వరుసగా రూ. 9.75 కోట్లు, రూ.14.50 కోట్లు, రూ. 17.75 కోట్లు వసూలు చేసిన హిందీ బాహుబలి-2 సోమవారం వసూలైన 8 కోట్ల రూపాయలను కలుపుకుని రూ. 437.22 కోట్లు వసూలు చేసింది. 

ఇప్పుడు అందరి కళ్లూ బాహుహలి-2 సాధించనున్న రూ. 500 కోట్లపైనే ఉంటున్నాయి. కాగా బాహుబలి-2 అద్భుత విజయం నేపధ్యంలో ఈ చిత్ర నిర్మాణంలో పాల్గొన్న సిబ్బంది సంబరాలు చేసుకోవడం మొదలెట్టేశారు. 
 
బాహుబలి-2 హిందీ వెర్షన్ పంపిణీదారు, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. ముంబైలో రోజు డిన్నర్లు, విందువినోదాలకు ప్రముఖులను ఆహ్వానిస్తూ జోష్ నింపుతున్నారు. మరోవైపు అయిదేళ్ల కష్టాన్ని మర్చిపోవడానికి అన్నట్లుగా చిత్ర హీరో, విలన్‌లు ప్రభాస్, రానా దగ్గుబాటి విదేశాల్లో సుందర ప్రదేశాల్లో సేద తీరుతున్నారు. బాహుబలి-2 సాధిస్తున్న అద్భుత విజయాన్ని విదేశాల నుంచే తెలుసుకుంటూ సంతోషంతో ఉంటున్నారని వినికిడి.
 
బాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది నేటికీ బాహుహలి-2 సునామీ గురించి మాట్లాడటానికి సిద్ధపడనంత జెలసీని ప్రదర్శిస్తుండగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ కపూర్ రాజమౌళి ప్రతిభకు అద్భుత ప్రశంసలందించారు. దానికి రాజమౌళి వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. 
 
Ranveer Singh ✔ @RanveerOfficial
B
A
H
U
B
A
L
I
⚔️⚜️Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దమ్ములేకపోతే వైభవం లేదు.. బాహుబలి-2 నిర్వచనం ఇదే.. సినిమా చూడకున్నా ఆకాశానికెత్తిన షారుఖ్ ఖాన్

దమ్ము లేకపోతే, సాహసించకపోతే వైభవం ఊరికే రాదని బాహుబలి విజయం నిరూపిస్తోందని బాలీవుడ్ ...

news

రాజకీయ నేతల్లో బాహుబలి-2 సునామీ.. ఇక్కడా రాజకీయాలే మరి

దేశం దేశం బాహుబలి సినిమా జ్వరంతో వేగిపోతోంది. బాహుబలి చూడని వాడు పాపాత్ముడు లెక్కన నేటికీ ...

news

అడ్డెడ్డే... అల్లు అరవింద్ 'బాహుబలి'ని ఆకాశానికెత్తేశారు... ఆ విషయంలో పవన్‌కు సపోర్ట్...

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ బాహుబలి సృష్టిస్తున్న సునామీ ...

news

నగ్న ఫోటోలు సెల్‌లో పెట్టుకుంది... హాకర్లు కాజేసి నెట్లో పెట్టేశారు... లబోదిబో...

ఆ మోడల్ తన నగ్న అందాన్ని ఫోటోలు తీసుకుని వాటిని చూసి ఆస్వాదించుకోవాలనుకుందో ఏమోగానీ ...

Widgets Magazine