గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (15:21 IST)

సమంతకు తిక్కుంది.. దానికో లెక్కుంది.. ఏంటది?

సమంతకు తిక్కుంది.. దానికో లెక్కుంది.. ఏంటది అనుకుంటున్నారా? అయితే చదవండి మరి.. ఏ మాయ చేసావె సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో తాను నటించిన ఒక్క సినిమాను కూడా సమంత చూడలేదట. తాను నటించిన సినిమాలను చూస్తే.. ఎక్కడ బాగా నటించలేదని విమర్శిస్తారోనని భయంతో తాను యాక్ట్ చేసిన సినిమాలను సమంత అస్సలు చూడనని స్వయంగా చెప్పుకుంది. అయితే తొలిసారిగా తాను నటించిన సినిమాలను చూడకూడదనే గీతను దాటానని చెప్పుకొచ్చింది. 
 
ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. ఐ హీరో విక్రమ్, సమంత నటించిన తమిళ చిత్రం 10 ఎండ్రదుకుళ్ల. ఈ సినిమాలో తన నటన విభిన్నంగా ఉంటుందని తెలిపింది. నేపాలీ అమ్మాయిగా కనిపిస్తానని, తొలిసారిగా డ్యుయెల్ రోల్ చేశానని, అంతేగాకుండా యాక్షన్  సీన్స్ చేశానని ఇలా వెరైటీ రోల్‌ చేశాను కాబట్టి ఆ సినిమా చూడాలని వున్నట్లు సమంత వెల్లడించింది. అందుకే ఈ సినిమాను తొలిసారిగా థియేటర్లో కూర్చుని చూసేందుకు సమంత రెడీ అయినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి.