Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2 ట్రైలర్ కొత్త రికార్డు.. 150 మిలియన్ వ్యూస్ దాటేసింది.. చైనాలో రిలీజ్

శుక్రవారం, 30 జూన్ 2017 (10:42 IST)

Widgets Magazine
baahubali 2 movie still

ప్రభాస్, రానా ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు యూట్యూబ్‌లో ఉంచిన ట్రైలర్ మొదటి రోజు నుంచే అత్యధిక వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. 
 
ఈ ట్రైలర్ ప్రస్తుతం 150 మిలియన్ల వ్యూసే దాటేసిందని బాహుబలి-2 టీమ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. భారతీయ సినీ చరిత్రలోని ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన బాహుబలి-2 చైనాలో విడుదల కానుంది. చైనాలోని 4 వేల థియేట‌ర్ల‌లో బాహుబలి 2 రిలీజ్ కానుంది. 
 
ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో సినిమా రిలీజ్ కానుంది. బాహుబ‌లి స్టార్సంతా ప్ర‌మోష‌న్ కోసం చైనా వెళ్ల‌నున్న‌ట్లు సమాచారం. చైనాలో దంగ‌ల్‌ను ప్రమోట్ చేసిన డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీనే బాహుబ‌లి 2 మేక‌ర్స్ సంప్ర‌దించారు. దంగ‌ల్ ఇండియాలో కంటే చైనాలోనే ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడ‌దే కంపెనీ ప్ర‌మోట్ చేస్తే.. బాహుబ‌లి 2 చైనాలోనూ రికార్డులు కొల్ల‌గొట్ట‌డం ఖాయమని సినీ యూనిట్ భావిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా ఇప్ప‌టికే రూ.1500 కోట్ల‌కుపైగా వ‌సూలు చేసిన నేప‌థ్యంలో.. చైనాలోనూ అదే రేంజ్‌లో వ‌స్తే మాత్రం దంగ‌ల్‌ను వెన‌క్కి నెట్టడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నటుడు అజయ్ భార్య 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ ఫైనల్ రౌండ్‌కి... కిరీటం వచ్చేస్తుందిలే...

మిస్ ఇండియా పోటీల్లో నెగ్గడం చాలా సుళువే అంటారు చాలామంది. కానీ మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ ...

news

రవితేజ నవ్వుతూ సెల్ఫీ... యాధృచ్చికం, అటు దిల్ రాజు భార్య, ఇటు రవితేజ బ్రదర్

విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. అయినవాళ్లు దూరమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. హీరో రవితేజ ...

news

హెల్త్ చెకప్‌ కోసం యుఎస్ వెళ్లనున్న 'తలైవా'.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంతేనా?

కోట్లాది మంది అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలైవా (రజనీకాంత్) మరోమారు అమెరికా ...

news

నేను పెళ్లి చేసుకోకపోవడానికి ఆ హీరోనే కారణమంటున్న నటి

ప్రముఖ సీనియర్ నటి టబూ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాతికేళ్ళుగా సినీ ...

Widgets Magazine