గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 6 జులై 2015 (15:09 IST)

యేలేటి దర్శకత్వంలో వెంకటేష్ కొత్త మూవీ... యంగ్ బ్యూటీతో రోమాన్స్...

ప్రయోగాత్మక సినిమాల దర్శకుడుగా పేరుపొందిన చంద్రశేఖర్ యేలేటి, ఫ్యామిలీ చిత్రాల హీరో విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్‌లో వారాహి చలన చిత్ర బ్యానర్‌లో సాయి కొర్రపాటి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన సమాచారం ఒకటి తాజాగా వెళ్లడైంది. ఇందులో వెంకటేష్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారట. 
 
వారిలో ఒకరు వెంకటేష్ వయస్సుకు సరిపోయే సీనియర్ హీరోయిన్ అయితే, మరొక హీరోయిన్ మాత్రం 17 ఏళ్ల లోపు వయస్సున్న యంగ్ బ్యూటీ. ఈ రెండు పాత్రల కోసం వెంకటేష్ వయస్సు సరిపడేలా ఉన్న అలనాటి అందాల తార నదియాను, మరో యంగ్ హీరో పాత్రకు యంగ్ హీరోయిన్ అవికా గోర్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. 
 
కాగా వారాహి నుంచి వచ్చిన 'దిక్కులు చూడకు రామయ్య' వంటి విభిన్న తరహాలో చిత్రాన్నిరూపొందించిన సాయి కొర్రపాటి తాజాగా వెంకటేష్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం సైతం ఓ విభిన్నమైన పాయింట్‌తో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినీ తెరకెక్కనున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాలో యంగ్ హీరోయిన్‌‌తో వెంకటేష్ రొమాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి.