Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిలీజ్‌కు ముందే 'అజ్ఞాతవాసి' రికార్డు

మంగళవారం, 5 డిశెంబరు 2017 (11:07 IST)

Widgets Magazine

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం విడుదలకు ముందే ఓ రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రాన్ని అమెరికాలో ఏకంగా 209 థియేటర్లలో విడుదల చేయనున్నారు.
agnathavasi movie still
 
సాధారణంగా పవన్‌కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల ఫాలోయింగ్ ఉంది. అలాగే, అమెరికాలో కూడా ఉందనే విషయంలో మరోమారు నిరూపితమైంది. అయితే, ప‌వ‌న్ తాజా చిత్రం 'అజ్ఞాత‌వాసి'ని ఏకంగా 209 థియేటర్స్‌లో విడుద‌ల చేస్తున్నార‌ట‌. 
 
గ‌తంలో ఏ ఒక్క భారతీయ చిత్రం కూడా యూఎస్‌లో ఇంత భారీ సంఖ్య‌లో విడుద‌ల కాలేద‌ని స‌మాచారం. ఎల్ఏ తెలుగు సంస్థ 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని యూఎస్‌లో రిలీజ్ చేస్తుంది. జ‌న‌వ‌రి 9న ప్రీమియ‌ర్ షోకి ప్లాన్ చేస్తుండ‌గా, ఇప్ప‌టినుండే దీనికి సంబంధించి ఎరేంజ్‌మెంట్స్ కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. 
 
తెలుగులో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం వార‌ణాసిలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మ‌రో వారం రోజుల‌లో టాకీ పార్ట్ పూర్తి చేసుకోనుంది. ఇందులో కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండగా, అనిరుధ్ సంగీత బాణీలు సమకూర్చుతున్నాడు. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, ఓవర్సీస్‌లో బాహుబలిని వణికిస్తున్నాడా? ఇదీ లెక్క

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ...

news

నో గ్రాఫిక్స్... అంతా ఎమోషన్సే, చెర్రీ-ఎన్టీఆర్ పాత్రలను చెక్కుతున్న జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అనగానే దానిపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక చెర్రీ, ఎన్టీఆర్ ...

news

'సైరా' కోసం యోధుడిలా శ్రమిస్తున్న 'మెగాస్టార్'

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' తర్వాత ఆయన చేస్తున్న 151వ చిత్రం "సైరా ...

news

ఔను... నేను తేడా అంటున్న షాలిని పాండే

నాకు ప్రేమ గురించి తెలియదు. ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో ...

Widgets Magazine