Widgets Magazine

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఎదురుచూపు... ఆమె అతడికి అలా వుంటుందట...(video)

మంగళవారం, 16 మే 2017 (11:49 IST)

Widgets Magazine

ట్విట్టర్ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం ట్రెయిలర్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రం విడుదలకు మరో మూడు రోజులే సమయం వుంది. మే నెల 19న విడుదల కాబోతోందీ చిత్రం. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చిత్రం చేతన్ భగత్ రచించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల ఆధారంగా నిర్మితమైంది.
half-girlfriend
 
చేతన భగత్ రచించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల మూడేళ్ల క్రితం అక్టోబరు 1, 2014న విడుదలైంది. ఈ నవలలో చేతన్ నేటి ప్రపంచంలోని మానవ సంబంధాలలో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఈ నవలలో ఢిల్లీకి చెందిన అందమైన, బాగా డబ్బున్న రియాతో బీహారి అబ్బాయి మాధవ్ ప్రేమలో పడుతాడు. తొలుత తను స్నేహితుడంటూ పరిచయం చేసుకుని తను ప్రేమిస్తున్నట్లు చెపుతాడు. కానీ ఆమె దాన్ని అంగీకరించదు. మరోవైపు మాధవ్‌కు సరిగా ఇంగ్లీషు మాట్లాడటం రాదు. 
 
రియా అనర్గళంగా మాట్లాడుతుంది. వీరి స్నేహం అలా సాగుతున్న సమయంలో రియాను తన ప్రియురాలిగా వుండాలని మాధవ్ ఒత్తిడి చేస్తాడు. అందుకామె అంగీకరించదు. స్నేహితులుగా మాత్రమే ఉండాలని ఆమె అంటుంది. అందుకు అతడు అంగీకరించడు. చివరికి రియా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా వుండేందుకు అంగీకరిస్తుంది. ఇలా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గా అంగీకరించిన ఆమె అతడికి ప్రియురాలిగా ఏమయినా ఇస్తుందా..? అసలేం చేసిందన్నది సినిమా.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బాహుబలి 2' వసూళ్లు రూ.1500 కోట్లే... నష్టాలు భర్తీ కావొచ్చు : నిర్మాత దేవినేని ప్రసాద్

బాహుబలి 2 చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. కానీ, ఈ చిత్ర వసూళ్లపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ...

news

''బాహుబలి''కి గాలం వేస్తున్న కమలం.. నో.. నో అంటోన్న ప్రభాస్..?

''బాహుబలి 2'' వసూళ్ళు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకూ వెయ్యి ...

news

రజనీ వ్యక్తిత్వం విశిష్టమైనది.. ఇప్పటికీ ఆ పూరి గుడిసె ఎందుకుంటుందో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కలుస్తున్నారు. వారిలో సెల్ఫీ దిగేందుకు సోమవారం నుంచి ...

news

తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీకి టైమ్ రాలేదు : కమల్ హాసన్

తమిళనాడులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విశ్వనటుడు ...