శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (13:35 IST)

అమ్మో.. సానియా ఫ్యాషన్ అదుర్స్: స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫోటో షూట్!

క్రీడలకే కాదు ఫ్యాషన్‌కు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. తాజాగా 2015కి గాను ఎన్డీటీవీ అందించే ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ప్రతీ ఏటా ఈ ఛానల్ అవార్డులిస్తోంది. అందులో భాగంగా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని సానియా మీర్జా సొంతం చేసుకుంది.
 
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనానెహ్వాల్‌కి కూడా ఈ అవార్డ్ వచ్చింది. అయితే ఆటతో పాటు.. అందంతోనూ డ్రస్సింగ్‌తోనూ ఆకట్టుకోవడంలో సానియా స్టైలే వేరు.  ప్రతీ ఫంక్షన్‌కి డిఫరెంట్ గెటప్ - ఫ్యాషన్‌తో హాజరయ్యే సానియా.. ఈ అవార్డు ఫంక్షన్లోనూ ప్రత్యేకత చాటింది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో ఉన్న సానియా మీర్జాని చూసి అందరూ షాక్ తిన్నారు. 
 
తన కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్న సానియా మీర్జా.. డబుల్స్ టైటిల్ గెలుచుకోవడంలో సత్తా చాటడం మాత్రమే కాదు.. ఫ్యాషన్లోనూ తన పవరేంటో చూపింది. అందుకని గ్లామర్ దుస్తులు వేసుకుని కళ్ళు చెదరనీయకుండా.. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా.. కంప్లీట్‌గా టాప్-గౌన్ ధరించినా బోలెడుమంది అభినందనలు అందుకుంది. అందులోనే అమ్మడి స్టైల్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నప్పుడైతే.. స్టార్ హీరోయిన్ల ఫోటో షూట్ రేంజ్‌లో సానియా మీర్జా అదరగొట్టేసింది.