శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (14:50 IST)

కమల్‌పై జాతీయ మీడియా కాలిమిస్టు ఆరోపణ: ఇస్లాంను నమ్ముతున్నారా? ట్రిపుల్ తలాక్‌పై?

జాతీయ మీడియా కథనాలు రాసేందుకు ప్రస్తుతం సినీ లెజెండ్ కమల్ హాసన్ దొరికారు. గతంలో బాలీవుడ్ టాప్ హీరోలను సైతం వదలని జాతీయ మీడియా.. ఈసారి కమల్ హాసన్‌ను టార్గెట్ చేసింది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కును మీడియాల

జాతీయ మీడియా కథనాలు రాసేందుకు ప్రస్తుతం సినీ లెజెండ్ కమల్ హాసన్ దొరికారు. గతంలో బాలీవుడ్ టాప్ హీరోలను సైతం వదలని జాతీయ మీడియా.. ఈసారి కమల్ హాసన్‌ను టార్గెట్ చేసింది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కును మీడియాలు హరిస్తున్నాయి. ఏది మాట్లాడిన సెన్సేషనల్ చేస్తుండటంతో ప్రముఖులు సైతం నోరు విప్పేందుకు వెనుకడుగు వేస్తున్నారు. 
 
అయితే తనకు తోచిన విషయాన్ని కుండబద్ధలు కొట్టేసే కమల్ హాసన్‌ ఇటీవల హిందువులపై కామెంట్లు చేశారు. "మహా భారతంలో పాంచాలిని జూదంలా ఉపయోగించుకున్నప్పటికీ, భారత్ ఇప్పటికీ ఆ మహాభారత గ్రంథాన్నే గౌరవిస్తుందని" కమల్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు కేసు కూడా పెట్టాయి.
 
కమల్ హాసన్ హిందువులను కించపరిచి తమ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ హావేరి జిల్లా అరమల్లాపుర శరణబసవేశ్వర దేవాలయం పీఠాధిపతి ప్రణవానంద స్వామిజీ, ఆయన శిష్యులు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్‌లో లెజండరీ హీరో కమల్ హాసన్ హిందూ వ్యతిరేక కామెంట్లు చేశారని.. ఆయన ఇస్లాంను నమ్ముతున్నారని కాలమిస్టు ఆరోపించారు.  
 
కమల్‌ తన మతాన్ని మరచి హిందూ, ముస్లింల మధ్య భేదాలను పొడసూపేలా ప్రవర్తిస్తున్నారని ఓ పేరాగ్రాఫ్‌లో పేర్కొన్నారు.  సమకాలీన సమస్యలైన త్రిపుల్‌ తలాక్‌ లాంటి వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మతాలపై మాట్లాడటప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుంటే బాగుంటుందని అన్నారు. అయితే ఈ కాలమిస్టులో ఓ పేరాగ్రాఫ్ వివాదాస్పదం కావడంతో ఆ పేరాగ్రాఫ్‌ను తొలగించారు. మహాభారతం లాంటి వాటిపై కామెంట్లు చేయడం కన్నా.. సమకాలీన సమస్యలైన త్రిపుల్‌ తలాక్‌ లాంటి వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మతాలపై మాట్లాడటప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుంటే బాగుంటుందని కమల్ హాసన్‌కు కాలమిస్టు సూచించారు. ఇంకా ఆయన పేరులోని హసన్ అనే పదానికి ముస్లిం అర్థం వచ్చేలా కాలమిస్టు పత్రికలో చెప్పుకొచ్చారు.