శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (14:17 IST)

లిప్ లాక్‌కు నిత్యామీనన్ నో: వేరే హీరోయిన్‌ ఇన్!

నిత్యామీనన్‌ ఓ పద్ధతిగా నటించుకుంటూ పోతోంది. అవకాశాల కోసం అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయని ఈ కాలం హీరోయిన్స్ మధ్యలో నిత్యామీనన్ అదుర్స్ అనిపించింది. పాత్రకు తగ్గట్టే లిప్ లాక్‌కు కాస్త హాట్‌గా కనిపించేందుకు అంగీకరించే నిత్యామీనన్.. ఈ మధ్య ఓ బిగ్ హీరోతో నటించే ఛాన్సును కోల్పోయిందట. క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఇచ్చే నిత్యామీనన్, గ్లామర్, స్కిన్ షో, బికినీలకు పూర్తిగా విరుద్ధం. 
 
తాజాగా ఓ తెలుగు సినిమాలో నటించేందుకు నిత్యకు ఆఫర్ వచ్చింది. అయితే అందులో సందర్భానికి అనుకూలంగా, సంబంధం లేని లిప్ లాక్‌కు, స్కిన్ షోలున్నట్లు తెలియడంతో నిత్య నో చెప్పేసింది. దీంతో చేసేది లేక ఆ సినీ యూనిట్ వేరే హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. మరి నిత్యామీనన్ అంటే ఏమనుకుంటున్నారు..!