శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (13:45 IST)

మతిస్థిమితం లేని బాలికపై రేప్: ''ABCD 2'' డ్యాన్సర్ నీలేష్ అరెస్ట్

''ABCD 2" డ్యాన్సర్ నీలేష్ నిర్భావనేను అత్యాచారం కేసు కింద పోలీసులు అరెస్ట్ చేశారు. మతిస్థిమితం లేని 14 సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన కేసులో నీలేష్ నిర్భావనేను ముంబై, పంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి, నిర్భయ చట్టం కింద కేసు పెట్టారు. 'ABCD 2' చిత్రంలో అద్భుత నృత్య ప్రదర్శనలు చూపిన టీంలో నీలేష్ సభ్యుడిగా నటించాడు. ఈ కేసులో నిర్భావనేతో పాటు ఆయన స్నేహితుడుని కూడా నిందితుడిగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మతిస్థిమితం లేని బాధితురాలు వ్యవహార శైలి.. ప్రవర్తనలో మార్పు గమనించిన టీచర్ అత్యాచారం జరిగిందని గుర్తించింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు.. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో తన స్నేహితుడితో కలసి బాధితురాలిని ఎవరూ లేని ప్రాంతాలకు, టాయిలెట్లలోకి తీసుకువెళ్లిన పలుమార్లు ఘోరానికి పాల్పడ్డాడని నిర్భావనే అంగీకరించాడని పోలీసులు చెప్పారు.