శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 7 నవంబరు 2016 (18:16 IST)

కర్నాటకలో విషాదం... సినిమా షూటింగ్‌లో ఇద్దరు విలన్లు మృతి, బయటపడ్డ హీరో

కర్నాటకలో జరుగుతున్న హస్తిగుడి సినిమాలో షూటింగులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఈ చిత్రంలో నటిస్తున్న ఇద్దరు విలన్లు నదిలో పడి మునిగిపోయి మృతి చెందారు. చిత్రం క్లైమాక్స్ సన్నివేశాన్ని హెలికాప్టర్ నుంచి హీరో, విలన్లు దూకినట్లు చిత్రీకరిస్తుండగా

కర్నాటకలో జరుగుతున్న హస్తిగుడి సినిమాలో షూటింగులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఈ చిత్రంలో నటిస్తున్న ఇద్దరు విలన్లు నదిలో పడి మునిగిపోయి మృతి చెందారు. చిత్రం క్లైమాక్స్ సన్నివేశాన్ని హెలికాప్టర్ నుంచి హీరో, విలన్లు దూకినట్లు చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విలన్లు, హీరోకు మధ్య పోరాట సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ముగ్గురిని హెలికాప్టర్లో ఎక్కించుకుని నది మధ్యలోకి వెళ్లారు.
 
అక్కడ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విలన్లు అనిల్, ఉదయ్ ఇద్దరూ నదిలో పడిపోయారు. ఆ తర్వాత హీరో విజయ్ కూడా జారి పడిపోయారు. వారిని కాపాడేందుకు చిత్ర బృందం చేసిన ప్రయత్నంలో హీరో విజయ్ ను మాత్రమే కాపాడగలిగారు. విలన్ పాత్రలలో నటిస్తున్న అనిల్, ఉదయ్ మృతి చెందారు.