గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 7 జులై 2017 (07:05 IST)

శంకరాచార్యపై సినిమా తీస్తారా.. ఆయన నోరిప్పితే కదా..

కంచిపీఠంలో 2004లో జరిగిన ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య, ఆ తరువాత పరిణామాలు పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్ట్‌ నేపథ్యంలో ఆచార్య అరెస్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగులోనూ డబ్ చేసి ర

కంచిపీఠంలో 2004లో జరిగిన ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య, ఆ తరువాత పరిణామాలు పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్ట్‌ నేపథ్యంలో ఆచార్య అరెస్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కథ కోసం శంకర రామన్‌ను హత్య చేసిన గ్యాంగ్ కు చెందిన వారిని కూడా కలిసినట్టుగా తెలిపాడు దర్శకుడు శ్రీనివాస రాజు.
 
అంతేకాదు త్వరలోనే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి మరిన్ని అంశాలపై చర్చిస్తానని, సినిమాలో అప్పటి సంఘటనకు సంబంధించిన రాజకీయ కోణంతో పాటు ప్రచారంలో ఉన్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేసే విధంగా సినిమా తెరకెక్కిస్తానని తెలిపారు. ఇటీవల సినిమాలు వివాదాలతోనే ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. కొన్ని సినిమాలు అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటే, కొంత మంది మేకర్స్ వివాదాస్పద అంశాలనే సినిమాలకు ఎంచుకుంటున్నారు. 
 
తాజాగా అలాంటి వివాదాస్పద సంఘటనతో తమిళ కన్నడ భాషల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. దండుపాళ్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శ్రీనివాస రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.