Widgets Magazine

లగ్జరీ కారు కొనుగోలు.. పన్ను ఎగవేత కేసు.. అమలాపాల్ అరెస్ట్

ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ అరెస్ట్ అయ్యింది. పుదుచ్చేరిలో నకిలీ ఆధారాలను సమర్పించి లగ్జరీ కారును రిజిస్ట్రేషన్ చేయించి.. రూ.20లక్షల మేర పన్ను ఎగవేసినట్లు ఆమెపై ఆరోపణలు వున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపాల్‌పై

amala paul
selvi| Last Updated: సోమవారం, 29 జనవరి 2018 (10:39 IST)
ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ అరెస్ట్ అయ్యింది. పుదుచ్చేరిలో నకిలీ ఆధారాలను సమర్పించి లగ్జరీ కారును రిజిస్ట్రేషన్ చేయించి.. రూ.20లక్షల మేర పన్ను ఎగవేసినట్లు ఆమెపై ఆరోపణలు వున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపాల్‌పై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. అయితే అమలాపాల్ బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

కానీ కొచ్చిలోని క్రైం బ్రాంచ్ కార్యాలయంలో అమలాపాల్ హాజరు కావాల్సిందిగా కోర్టు నోటీసులు పంపింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కొచ్చి క్రైం బ్రాంచ్ కార్యాలయానికి హాజరైన అమలాపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు. అలాగే నస్రియా భర్త అయిన పహత్ పాసిల్, ఎంపీ అయిన సురేష్ గోపీలు కూడా పన్ను ఎగవేత కేసులో అరెస్టై తదనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.


దీనిపై మరింత చదవండి :