Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.20లక్షల పన్ను ఎగ్గొట్టిన అమలా పాల్: బెయిల్ మంజూరు చేసిన కోర్టు

బుధవారం, 17 జనవరి 2018 (17:36 IST)

Widgets Magazine

అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ అంతే గుర్తింపు సంపాదించుకుంది. తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్‌తో ప్రేమాయణం, అతనిని వివాహం చేసుకోవడం, సంవత్సరం తిరిగేలోపు విడాకులు తీసుకోవడం ద్వారా అమలా పాల్ వార్తల్లోకెక్కింది. 
 
విడాకుల తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమలాపాల్ త్వరలో రెండో పెళ్లి చేసుకుంటానని తాజాగా చెప్తోంది. మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి వెనుకాడనని పేర్కొంది. ఈ గ్యాప్‌లో సినిమాల్లో బాగా సంపాదించాలని అమలాపాల్ నిర్ణయించుకుంది. ఆఫర్లు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 
 
అయితే ఇటీవల అమలాపాల్ ఓ ఖరీదైన కారు కొని తప్పుడు పత్రాలు సమర్పించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో ఆమెపై కేరళలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల ఆమె బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, తిరస్కరించిన కోర్టు, క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలోనే అమలా పాల్ పోలీసుల ముందు లొంగిపోయింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని గతంలో చెప్పుకున్న అమలా పాల్ పన్ను ఎగ్గొట్టిన మాట నిజమేనని పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా మొద‌ట పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోవాలని ఆమెను కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె ఎట్టకేలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవడంతో కేరళ హైకోర్టు బుధవారం  రూ.లక్ష పూచీకత్తుతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సొంత ఊరిలో కత్తి మహేష్‌ను చితకబాదిన పవన్ ఫ్యాన్స్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్‌లలో పవన్ ...

news

హీరోలతో పోటీకి సై అంటోన్న భాగమతి: బ్లాక్‌బస్టర్ ఖాయమా?

''పిల్ల జమీందారు'' ఫేమ్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో... యూవీ క్రియేషన్స్ సంస్థ రూపొందించిన ...

news

మెగా హీరోతో డైలీ డేటింగ్‌లో రకుల్...

తెలుగు, తమిళం, హిందీ చిత్ర సీమల్లో బిజీగా గడుపుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ...

news

షాకింగ్ బడ్జెట్: చెర్రీ-ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమాకు రూ.90కోట్లు

బాహుబలి మేకర్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, చెర్రీ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు రంగం సిద్ధం ...

Widgets Magazine