Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నంది అవార్డులను ''ఎల్లో''గా మార్చేశారు.. చిరంజీవి పేరు..?

ఆదివారం, 26 నవంబరు 2017 (13:28 IST)

Widgets Magazine
nandi awards

దేశ వ్యాప్తంగా పద్మావతి సినిమాపై రచ్చ జరుగుతుంటే.. ఏపీలో నంది అవార్డులపై వివాదాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై నటుడు జీవీ సుధాకర్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. సినీ పరిశ్రమను, నంది అవార్డులను ఏపీ సర్కారు ఎల్లోగా మార్చేసిందని విమర్శలు గుప్పించాడు.
 
ఈ మేరకు ద్రాక్షారామంలో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు తాను దాసరి నారాయణ రావు ప్రోద్భలంతో అరంగేట్రం చేశానని తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని గురించి తెలుసుకున్న దాసరి.. తన పేరు మొదట్లో చిరంజీవి పేరులోని చివరి రెండు అక్షరాలనూ చేర్చారని, ఈ క్రమంలోనే తన పేరు ముందు జీవి చేరిందని సుధాకర్ నాయుడు చెప్పుకొచ్చారు. విజయవాడలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంపై స్పందిస్తూ... బోటు యజమాని రాష్ట్ర మంత్రి కావడంవల్లే ఆ విషయాన్ని తొక్కేశారన్నారు. 
 
మరోవైపు నంది అవార్డులకు లింకు పెట్టి ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైకాపా అధికార ప్రతినిధి కె. పార్థసారథి ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలన్నారు. పోలవరంకు కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని పార్థసారథి సూటిగా ప్రశ్నించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సన్నీలియోన్‌పై పాము.. ఎలా జడుసుకుందంటే (వీడియో)

గరుడ వేగ డియో డియో పాటకు చిందేసి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఖుషీ చేసిన బాలీవుడ్ స్టార్ ...

news

సమంతలా రకుల్ ప్రీత్ కూడా తెలుగింటి కోడలవుతుందా?

''లౌక్యం'' చిత్రంలో స్విమ్మింగ్ పూల్‌ సీన్ గురించి టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ ...

news

జబర్దస్త్ నవ్వుకోవడానికే...లాజిక్స్ కోసం వెతకొద్దు: అనసూయ

జబర్దస్త్ షోలో అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాధలు అంటూ ...

news

నేను శాడిస్ట్‌నా - వారిని దేవుడే శిక్షిస్తాడు... వేణుమాధవ్

అధికార తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడూ వైసిపి నేతలపై విమర్శలు ...

Widgets Magazine