Widgets Magazine

తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీకి టైమ్ రాలేదు : కమల్ హాసన్

మంగళవారం, 16 మే 2017 (09:41 IST)

Widgets Magazine
kamal haasan

తమిళనాడులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పాగా వేసేందుకు అపుడే సమయం రాలేదన్నారు. 
 
ఆయన తాజాగా ఓ అంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ... తమిళనాడులో వేళ్లూనుకునే సమయం బీజేపీకి ఇంకా రాలేదన్నారు. తనకు సంబంధించినంత వరకు జాతీయ జెండా కనిపిస్తే తలవంచి నమస్కరిస్తానని చెప్పారు. తమిళనాడులో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 
 
బీజేపీకి తమిళనాడు అనుకూలిస్తుందా? లేదా? అన్న విషయం తనకు తెలియదని, అయితే బీజేపీకి తమిళనాడులో ఇంకా టైం రాలేదని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకుడు ఒకరు తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు.. ఈ దేశంలో తమిళనాడు ఒక భాగం కాబట్టి రాష్ట్రాభివృద్ధిలో ఎవరైనా భాగం పంచుకోవచ్చని కమల్ హాసన్ స్పష్టం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చైనాలో దంగల్ సునామీ.. టాప్ వన్ సినిమాగా అమీర్ ఖాన్ రికార్డు.. బాహుబలి-2కి నిజమైన పోటీ

చైనాలో కలెక్షన్ల వరద సృష్టిస్తున్న అమీర్ ఖాన్ చిత్రం దంగల్ హాలీవుడ్ తాజా చిత్రాలను కూడా ...

news

రూ. 432 కోట్లు సాధించిన బాహుబలి-2 హిందీ వెర్షన్.. రూ. 1500 కోట్లకు చేరువగా ప్రపంచవ్యాప్త కలెక్షన్లు

దేశీయ, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది కంక్లూజన్ ప్రభంజనం కొనసాగిస్తోంది. ...

news

కేరళలో 50 కోట్ల క్లబ్‌లో ప్రవేశించిన బాహుబలి-2.. మాలివుడ్ ఆల్ టైమ్ కలెక్షన్ల చరిత్రలో రెండో స్థానం

కేరళ చలనచిత్ర చరిత్రలో అరుదైన రికార్డుకు చేరువవుతున్న బాహుబలి-2 చిత్రం రెండు వారాల్లో రూ. ...

news

‘బాహుబలి-2’ నిర్మాతలకు సైబర్ నేరస్తుల బెదిరింపులు.. రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్

ఇంతవరకు బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకే పరిమితమైన మాఫియా బెదిరింపులు టాలీవుడ్‌కీ పాకుతున్నట్లు ...