Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమన్నాతో లింకు పెట్టారు.. ఎంజాయ్ చేశాను.. ఊపిరి హీరో కార్తీ

సోమవారం, 6 నవంబరు 2017 (17:34 IST)

Widgets Magazine

హీరో కార్తీ ఆవారా ద్వారా ఎంటరై ఊపిరి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖాఖీ సినిమాలో నటించిన కార్తీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన లవ్ సీన్స్ చూసినప్పుడు.. లవ్ సీన్స్‌లో టచ్ చేయకుండా యాక్ట్ చేయడం కష్టమా అని తన భార్య అడుగుతుంటుందని కార్తీ చెప్పారు.
 
పెర్ఫార్మెన్స్ పరంగా తాను కొంచెం ఎక్స్‌ట్రా అని.. ప్రేమ, పెళ్లి వంటి సీన్స్‌లో పూర్తిగా ఇన్వాల్స్ కాకపోతే, ఆ సన్నివేశాలు కృత్రిమంగా అనిపిస్తాయని చెప్పేవాడినని కార్తీ తెలిపారు. ఆడియన్స్‌కు ఆ ఫీల్ కలిగేలా నటించవలసి వుంటుంది. ఆ విషయంలో తన భార్యకు జెలసీ సహజమని.. ఈ విషయంలో తనకు ఆమెకు గొడవలు జరుగుతూనే వుంటాయని.. అందుకే తన సినిమాలు చూడొద్దనే తానే ఆమెకు చెప్తూ వుంటానని కార్తీ తెలిపారు. 
 
తమన్నాతో లింకుపెట్టినప్పుడు ఎంజాయ్ చేసే దాన్నని.. లవ్ స్టోరీలు, మళ్లీ మళ్లీ ఒకే హీరోయిన్‌తో చేయడంతో తమన్నాతో లింకుపెట్టారని మీడియాకు ఆ విషయం దొరికిందని కార్తీ వెల్లడించారు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లెవరూ తనకు ప్రపోజ్ చేయలేదన్నారు. తమన్నాతో లింక్ చేస్తూ స్పైసీ న్యూస్ కోసం కొంతమంది ఇలాంటివి సృష్టించారని.. ఒక రకంగా ఇలాంటి వార్తలను అప్పట్లో ఎంజాయ్ చేశానని చెప్పారు. 
 
కాలేజ్ లో చదువుకునేటప్పుడు ఒక్క అమ్మాయి కూడా తన వైపు చూడలేదని.. హీరో అయ్యాక లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు కాలేజీ అమ్మాయిలు తనను పెళ్లి చేసుకోమని వెంటపడ్డారని కార్తీ చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అనూ ఇమాన్యుయెల్... చంపేసే అందం... అర్థరాత్రి దాటినా కష్టపడుతుందట...

ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ మేనియా నడుస్తోంది. ఆమె పేరే అనూ ఇమాన్యుయెల్. ఒకే ...

news

సమంత సినిమాల్లో కనిపించేది ఇక రెండేళ్లే.. తర్వాత ఫ్యామిలీ లైఫ్‌లోకి...?

చెన్నై బ్యూటీ సమంత.. అక్కినేని వారింటి కోడలైంది. ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం ...

news

సూసైడ్ చేసుకోవాలని భావించిన గోవా బ్యూటీ

గోవా బ్యూటీ ఇలియానా. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన ...

news

'గరుడవేగ' కోసం కోట్ల ఆస్తి తాకట్టు... అందుకే 'జెంటిల్‌మెన్' వదులుకున్నా... రాజశేఖర్

గరుడవేగ చిత్రం సక్సెస్ బాటలో నడుస్తుండటంతో హీరో రాజశేఖర్ కు ఊపిరి వచ్చినట్లయింది. ఈ ...

Widgets Magazine