గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (13:51 IST)

ఒకటేంటి? రెండేంటి? ఏకంగా పది గ్రామాల్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు

ఒకటేంటి ? రెండేంటి.. ఏకంగా పది గ్రామాలను మంచు విష్ణు దత్తత తీసుకున్నాడు. టాలీవుడ్‌ స్టార్స్ కొందరు గ్రామాలను దత్తత తీసుకుంటామని ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. తన సొంత గ్రామం బుర్రిపాలెం, తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదేవిధంగా మంచు విష్ణు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చాడు. 
 
ఏకంగా పది గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పది గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మంచు విష్ణు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ గ్రామాల్లో ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యను అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. 
 
ఇప్పటికే బాలికల పాఠశాలల్లో మంచు విష్ణు టాయిలెట్లను నిర్మించేలా చేశాడు. ఈ కార్యక్రమం మరికొన్ని పాఠశాలల్లో కొనసాగుతుందన్నాడు. ఇక దత్తత తీసుకోనున్న గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నట్లు చెప్పాడు.