శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (16:53 IST)

న‌వీన్ విజ‌య్ కృష్ణ‌, నిత్యా న‌రేష్‌లు బాగా సహకరిస్తున్నారు : డైరక్టర్ పి.వి. గిరి

నవీన్ విజయ కృష్ణ, నిత్యా నరేష్ జంటగా ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై చిత్రం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. పి.వి.గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ గుబ్బల ఈ చిత్రాన్ని

నవీన్ విజయ కృష్ణ, నిత్యా నరేష్ జంటగా ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై చిత్రం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. పి.వి.గిరి దర్శకత్వంలో బిక్షమయ్య, రాధాకిషోర్ గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు పి.వి.గిరి మాట్లాడుతూ, చాలా సినిమాలకు రచయితగా వర్క్ చేసిన నేను ఈ సినిమా కథ చెప్పగానే నిర్మాతలు నన్నే డైరెక్ట్‌ చేయమని అనడంతో సరేనన్నాను. దర్శకుడిగా నాకు అవ‌కాశాన్ని ఇచ్చిన నిర్మాత‌ల‌కు ముందుగా థాంక్స్‌. సినిమా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే జ‌రుగుతుంది. న‌వీన్ విజ‌య్ కృష్ణ‌, నిత్యా న‌రేష్‌లు బాగా కో ఆప‌రేట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్లానింగ్‌లోనే పూర్తి చేశాం. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ చంద్ర మంచి సంగీతానందించారు. స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడి చాలా సూప‌ర్బ్‌గా వ‌చ్చింది. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు మొద‌లైనట్టు చెప్పారు.
 
ఇకపోతే చిత్ర నిర్మాతలు బిక్షమయ్య సంగం, రాధాకిషోర్ గుబ్బ‌ల మాట్లాడుతూ, డైరెక్టర్ గిరితో చాలా కాలంగా మంచి ప‌రిచయం ఉంది. ఎప్ప‌టి నుండో ఆయ‌న‌తో ట్రావెల్ అవుతున్నాం. మా సినిమాకు మంచి టీం కుదిరింది. మంచి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్‌, న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాం. చివ‌రి షెడ్యూల్ మిన‌హా సినిమా అంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. అందులో భాగంగా డ‌బ్బింగ్ ప్రారంభ‌మైంది. సినిమాను ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేసి ప్రేక్ష‌కులు ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. 
 
జె.పి.రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్, జయప్రకాష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, డైలాగ్స్: పి.వి.గిరి, ఎ.సురేష్ బాబు, ఆర్ట్: వెంకట్ సన్నిధి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, మ్యూజిక్: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బిక్షమయ్య సంగం, రాధాకిషోర్ గుబ్బల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి.