Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా భర్త వ్యసనపరుడు... నాకు సుఖమివ్వలేదు... భరణం ఇప్పించండి : కోర్టులో పృథ్వీ భార్య గెలుపు

గురువారం, 29 జూన్ 2017 (11:03 IST)

Widgets Magazine
Comedian Prudhviraj

'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' అంటూ తెలుగు చిత్రపరిశ్రమలోనేకాకుండా సినీ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు పృథ్వీ అలియాస్ పృథ్వీరాజ్. ఆయనపై భార్య పెట్టి కేసులో విజయవాడ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఈ బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూకు మైండ్‌‌బ్లాంక్‌ అయ్యింది. పృథ్వీ భార్యకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో థర్టీ ఇయర్ ఇండస్ట్రీ స్టార్‌ చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఈ కమెడియన్‌పై భార్య దాఖలు చేసిన కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే... 
 
విజయవాడ అరండల్‌పేటకు చెందిన శ్రీలక్ష్మిని నటుడు శేషు అలియాస్‌ మూర్తి అలియాస్‌ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌ గత 1984లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు విజయవాడలో మిఠాయి దుకాణం నిర్వహిస్తూ వచ్చేది. ఆమె తండ్రి చనిపోవడంతో శ్రీలక్ష్మి నిర్వహిస్తూ వచ్చిన దుకారణంలో పృథ్వీరాజ్‌ కూడా కొంతకాలం పని చేశారు. ఆ సమయంలోనే నటనపై ఆసక్తితో తరచూ చెన్నై వెళ్లేవారు పృథ్వీరాజ్‌.
 
క్రమేణా సినీ రంగంలో రాణించడంతో కాపురం హైదరాబాద్‌కు మారింది. భాగ్యనగరానికి చేరుకున్న తర్వాత తన భర్త వ్యసనపరుడయ్యాడనీ, తనను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని పేర్కొంది. అంతేకాకుండా, 2016 ఏప్రిల్‌ 5న ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. దీంతో ఆమె విజయవాడకు చేరుకుంది. పిమ్మట భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కొంతమంది పెద్దలు ప్రయత్నించారు. అయినా పృథ్వీ పట్టించుకోలేదని శ్రీలక్ష్మీ ఆరోపిస్తోంది. దీంతో 2016 నవంబరు 2న సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో భర్త పృథ్వీపై కేసు పెట్టగా, సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టారు.
 
అదేసమయంలో తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉన్నందున తన జీవనోపాధి నిమిత్తం అతని నుంచి నెలకు 10 లక్షల రూపాయలు ఇప్పించాలని కోరుతూ విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆమె ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పృథ్వీకి పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయినా ఆయన ఆ సమన్లు తీసుకోక పోవడంతో హైదరాబాద్‌లో పేపరు ప్రకటన ద్వారా నోటీసులు ఇచ్చారు. ఆపై కేసు వాయిదాకు పృథ్వీరాజ్‌ హాజరు కాలేదు. చివరకు బాధితురాలి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు శ్రీలక్ష్మికి నెలకు 8 లక్షలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుతో పృథ్వీరాజ్‌కి ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తల్లీ నువ్వు.. బట్టలు లేకుండా నటిస్తున్నావా? : సన్నీ పోర్న్ మూవీ చూసి షాకయ్యారు.. ఎవరు?

పోర్న్‌స్టార్ సన్నీలియోన్. విదేశాల నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన పోర్న్ సుందరాంగి. ...

news

భరత్‌కు శునకాలంటే ఇష్టం.. వీడియో వైరల్..

సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భరత్‌రాజ్ (50) ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాల్ గూడ వద్ద గత ...

news

దిలీప్‌కు భావన వార్నింగ్: పల్సర్ సునీ నాకు ఫ్రెండా? నోరు విప్పితే డేంజర్.. మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు..!

కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన నటి భావన మలయాళ స్టార్ దిలీప్‌కు వార్నింగ్ ఇచ్చింది. ...

news

పోర్న్‌స్టార్ ముఖానికి దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు.. ఆమె పంచ్ ఇచ్చింది

అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మియా ఖలిఫా అనే యువతి పోర్న్‌స్టార్‌గా నటించింది. ఈమె ...

Widgets Magazine