కుర్ర హీరోలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ముదురు హీరో!!
తమిళ చిత్ర పరిశ్రమలోని ముదురు హీరోల్లో శరత్ కుమార్ ఒకరు. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీకి కూడా సుపరిచితుడే. పైగా, సీనియర్ నటి రాధికా భర్త. అయితే, ఈ ముదురు హీరో ఇపుడు కుర్ర హీరోలకు ముచ్చెమటలు పోయిస్తున్నాడు. దీనికి కారణంగా ఆయన ఫిట్నెస్. 66 యేళ్ళ వయసులో కూడా కండలు మెలితిప్పుతున్నాడు.
ఆరు పలకల (సిక్స్ ప్యాక్) దేహం, కండలు పెంచడం మీరే కాదు.. మేం కూడా చేయగలమంటూ ఆరు పదులు దాటిన స్టార్స్ పడుతున్న పోటీ చూస్తే ప్రేక్షకులు షాకవుతున్నారు. అసలు విషయమేమంటే.. శరత్‌కుమార్ జిమ్‌లో తన రీసెంట్ ఫొటోను షేర్ చేశారు.
66 ఏళ్ల వయసులో శరత్‌కుమార్ ఫిజిక్ చూసి షాకవడం ఆడియెన్స్ వంతైంది. 'నీ డెడికేషన్‌తో నన్ను షాకిస్తావు.. నాకు ఎంతో స్ఫూర్తినిస్తావు' అంటూ రాధికా శరత్‌కుమార్ కూడా ఫొటోపై కామెంట్ చేశారు. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' తమిళ రీమేక్‌లో శరత్‌కుమార్ నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.