Widgets Magazine

రైతులకు ''అభిమన్యుడు'' సాయం.. జగన్ అంటే చాలా ఇష్టం: విశాల్

మంగళవారం, 12 జూన్ 2018 (12:23 IST)

'అభిమన్యుడు' సినిమాపై హీరో విశాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపాడు. అభిమన్యుడు సినిమా ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదన్నాడు. డిజిటల్ ఇండియా మంచిదే అయినా.. ఇందుకు ప్రజలు ఎంతవరకు సిద్ధంగా వున్నారనేది ఆలోచించుకోవాలన్నాడు. ఆధార్ కార్డును అన్నింటికీ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పిందనే విషయాన్ని విశాల్ గుర్తు చేశాడు. ఇప్పటికీ రైతుల సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదన్నాడు. 
vishal
 
తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతుల పట్ల విశాల్‌ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన సినిమా సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల విడుదలైన తన ''అభిమన్యుడు'' సినిమా ఒక్కో టికెట్‌పై రూపాయి చొప్పున రైతులకు అందివ్వనున్నాడు. జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ''అభిమన్యుడు'' మంచి టాక్‌ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా తొలి వారంలోనే రూ.12 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.
 
ఇంకా విశాల్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేస్తే తమలాంటి వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నాడు. కానీ వారు ప్రజలను మోసం చేస్తుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏర్పడిందన్నాడు. డబ్బు, పేరు వున్నా.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానంటే అందుకు ప్రస్తుత రాజకీయ నేతలు విఫలమయ్యారనే చెప్పాలని విశాల్ వ్యాఖ్యానించాడు. 2019 ఎన్నికల్లో అవసరమైతే పోటీ చేసేందుకు సిద్ధమన్నాడు. 
 
వ్యక్తిగతంగా అడిగితే తనకు వైకాపా చీఫ్ జగన్ అంటే చాలా ఇష్టమని, ఐ లవ్ జగన్ అని విశాల్ వ్యాఖ్యానించాడు. అలాగని తానేమీ ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకం కాదన్నాడు. జగన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తనకు నచ్చిందన్నాడు. ఏ పార్టీ అయినా సరే.. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం అందిస్తే ఆ పార్టీకి ప్రచారం చేస్తానని విశాల్ చెప్పాడు. 
 
తమిళనాడు రాజకీయాల్లో తాను తెలుగువాడినని ముద్రవేస్తున్నారని.. అయినా తనకేం అభ్యంతరం లేదన్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజల కోసం రోడ్డుపైకి వచ్చారని.. కాబట్టి ఆయన్ని కూడా రాజకీయాల్లో ఆహ్వానిద్దామని విశాల్ తెలిపాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
అభిమన్యుడు విశాల్ మోదీ సుప్రీం కోర్టు జగన్ చంద్రబాబు Abhimanyudu 2019 Elections Actor Vishal Shocking Comments Ys Jagan Vishal On Politics

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. సీన్స్ తలపించిన విజేత ట్రైలర్..

విక్టరీ వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో తండ్రి-కొడుకుల మధ్య ...

news

హైపర్ ఆది చేసిన ఆ పనికి యాంకర్ అనసూయ ఆగ్రహం...

జబర్దస్త్ పోగ్రామ్ ఏ స్థాయిలో నడుస్తుందో చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమం వస్తుందంటే ...

news

ఆ సీనియర్ నటుడి కూతురితో కలిసి తిరిగితే తప్పేంటి? విశాల్ ప్రశ్న

సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్లకు లింక్‌లు పెట్టడం మామూలే. యువ హీరోల గురించి అస్సలు ...

news

విక్రమ్ 'సామి-2'కు కోటి వ్యూస్.. యూట్యూబ్ షేక్

తమిళ హీరో చియాన్ విక్రమ్ తాజా చిత్రం "సామి-2". గతంలో వచ్చిన 'సామి' చిత్రానికిది సీక్వెల్. ...

Widgets Magazine