శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 మే 2016 (13:31 IST)

అబ్బెబ్బే వాళ్లు అపరిచితులు కాదు... వాళ్ల కారు కూడా నాకిచ్చారు... అపూర్వ కేసు వాపస్

ఆంటీ పాత్రల్లో కనిపించి, హాటెస్ట్ పాత్రల్లో సైతం మెప్పించే నటి అపూర్వ నిన్న ఎస్ఆర్ నగర్ లో తనకు ప్రాణభయం ఉన్నదంటూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె తాజాగా తను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. కేసును ఉపసంహరించుకుంటూ తన ఇంటి చుట్టూ

ఆంటీ పాత్రల్లో కనిపించి, హాటెస్ట్ పాత్రల్లో సైతం మెప్పించే నటి అపూర్వ నిన్న ఎస్ఆర్ నగర్ లో తనకు ప్రాణభయం ఉన్నదంటూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె తాజాగా తను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. కేసును ఉపసంహరించుకుంటూ తన ఇంటి చుట్టూ అపరిచితులు తిరుగుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్న విషయాన్ని ఆమె కొట్టి పారేసినట్లు కూడా చెపుతున్నారు. 
 
వాళ్లు అపరిచితులేమీ కాదని చెప్పినట్లు సమాచారం. పైగా తన కారును ఢీకొట్టినవారు పాడైపోయిన కారును పూర్తిగా బాగు చేయించడమే కాకుండా ఆ కారు తిరిగి ఇంటి వద్ద అప్పగించేవరకూ తమ కారును మీ ఇంటి వద్ద ఉంచుకోమన్నట్లు చెప్పారట. దాంతో తను పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అపూర్వ చెప్పినట్లు తెలుస్తోంది.