శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 జులై 2015 (16:21 IST)

'గోపాల గోపాల' హీరోయిన్ దీక్షా పంత్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్...

హైదరాబాద్ సిటీలో అర్థరాత్రి ప్రయాణాలు కామన్. అందులోనూ సినిమా స్టార్లు తిరిగే సిటీ కావడంతో ముద్దుగుమ్మలు షూటింగులు ముగించుకుని అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్లబోయేటప్పటికి అర్థరాత్రి దాటిపోతోంది. ఇక నగరంలో బాగా తాగి వాహనాలను నడిపేవారు ఎక్కువవుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ దీక్షా పంత్ కారులో వస్తుండగా ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేశారు పోలీసులు. ఆమె రిపోర్ట్ నెగటివ్ రావడంతో పోలీసులు వదిలేశారు. ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య ఒకలైలా కోసం చిత్రంలోనూ, పవన్, వెంకీల గోపాల గోపాల చిత్రాల్లో నటించింది. మరికొన్ని కొత్త చిత్రాలను అంగీకరించినట్లు తెలుస్తోంది.