Widgets Magazine

ఎమీ పరిస్థితి ఇంత దిగజారిందా.. నవ్వుకుంటున్న పిల్ల హీరోయిన్లు

హైదరాబాద్, గురువారం, 13 జులై 2017 (06:22 IST)

Widgets Magazine

మదరాసుపట్టణం సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో ఒకవెలుగు వెలిగిన హీరోయిన్ ఎమీ జాక్సన్ పరిస్థితి ఇప్పుడు ఎంత దిగజారిపోయిదంటే  ఒకకన్నడ సినిమాలో పిల్ల హీరోయిన్లు కూడా అంగీకరించనంత తక్కువ రెమ్యునరేషన్‌‌కు ఒప్పుకుందట. స్వయం కృతాపరాధం కొంత, అవకాశాలు కరువవడం కారణంగా ప్రస్తుతం తనకు ఒక ఆంగ్ల సినిమా తప్ప మరే అవకాశాలూ ఇతర భాషల్లో లేవని తెలుస్తోంది.
 
మదరాసుపట్టణం చిత్రం నుంచి వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ మధ్యలో తెలుగు, హిందీ భాషల్లోనూ మెరిసిన ఎమీజాక్సన్‌ తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా బ్రహ్మాండ చిత్రం చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఎమీ చేతిలో ఒక్క ఆంగ్ల చిత్రం మినహా ఇతర భాషల్లో అవకాశాల్లేవు. వివాదాస్పద జంతుసంరక్షణ సంస్థ పెటాకు ఇప్పటికీ తన మద్దతు తెలపడం, బాలీవుడ్‌ భామలకంటే అధికంగా బందా ప్రదర్శించడంతో ఇక్కడ అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదని సమాచారం. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్రాలను నమ్ముకుని చెన్నైలో సొంత నివాసం ఏర్పరచుకున్న ఎమీ 2.ఓ చిత్ర విడుదల కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తోందట. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఎమీకి శాండిల్‌వుడ్‌ నుంచి పిలుపువచ్చింది. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ది విలన్‌ అనే చిత్రంలో ఒక పాత్ర చేయడానికి అంగీకరించింది. అందుకు చాలా తక్కువ పారితోషికం పుచ్చుకోవడానికి ఓకే అన్నదట. దీంతో ఆ పారితోషికానికి తాము కూడా అంగీకరించమని, అలాంటిది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోయిన్‌ ఎమీజాక్సన్‌ ఎలా అంగీకరించిందని చిన్నకారు హీరోయిన్లు సైతం ఆమె ఎందుకిలా చేసిందని నవ్వుకుంటున్నారట. తమిళ సినిమా నటి ఎమీజాక్సన్‌ ఎందుకిలా చేసిందీ అన్న ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోందిప్పుడు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జగ్గా జాసూస్: టైమ్ దొరుకుతుందో లేదో.. ముందుగానే కత్రీనాతో కేక్ కట్ చేయించిన రణ్ బీర్ (వీడియో)

ఒకప్పుడు బాలీవుడ్ ప్రేమ పక్షులుగా విదేశాల్లో విహరించి.. ఆపై సహజీవనం చేసి.. బ్రేకప్ ...

news

తమిళ బిగ్‌బాస్ షోపై ఫిర్యాదు.. 75శాతం నగ్నంగా నటిస్తున్నారు.. కమల్‌తో పాటు వారిని?

తమిళ బిగ్‌బాస్ షోపై వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోకు ...

news

పెళ్ళి పనుల్లో బిజీ బిజీ అయిన బాహుబలి నటులు.. ప్రభాస్, అనుష్క, తమన్నా...?

బాహుబలి సినిమా రెండు భాగాలు రిలీజైపోయాయి. ఇక ఈ మెగా ప్రాజెక్టు కోసం పనిచేసిన నటీనటులంతా ...

news

టాలీవుడ్ పంబ రేపుతున్న పటేల్ సర్... రెమ్యునరేషన్ 2 కోట్లట...?(వీడియో)

ఈమధ్య కాలంలో హీరోల కన్నా విలన్లకే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నిర్మాతలకు ...