Widgets Magazine

హరితేజ- అల్లు అర్జున్ స్వీట్ వార్నింగ్.. హరితేజ భర్త గురించి తెలుసా?

గురువారం, 28 డిశెంబరు 2017 (13:05 IST)

హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వుండదు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత హరితేజ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈమెకు సినీ నటిగా, యాంకర్‌గా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా సినీ షూటింగ్‌లో వున్న హరితేజ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి చెప్పుకొచ్చింది. 
 
తన భర్త బెంగళూరులో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారని చెప్పింది. షూటింగులు లేనప్పుడు బెంగుళూరు వెళ్తానని వెల్లడించింది. ఆయన వైపు నుంచి లవ్ మ్యారేజ్ అని, తన వైపు నుంచి అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పింది.

ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తన భర్త తనతో సరదాగా అంటుంటారని తెలిపింది. షూటింగ్ లేకపోతే బెంగళూరులో వుంటానని.. షూటింగ్ ఉందని ఫోన్ వస్తే పెట్టేబేడా సర్దుకుని ఇక్కడకు వచ్చేస్తానని హరితేజ చెప్పుకొచ్చింది.
 
ఇదిలా ఉంటే.. తాజాగా హరితేజ ఒక్క క్షణం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు యాంకరింగ్ చేస్తూ.. అల్లు అర్జున్‌పై ప్రశంసలు గుప్పించింది. తనకు అల్లు అర్జున్ అంటే విపరీతమైన ఇష్టమని చెప్పింది. ఐతే అల్లు అర్జున్ మాత్రం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తనకు చాలా ఇష్టమైన నటి హరితేజ అని కౌంటరిచ్చారు. చాలా చక్కగా హోస్ట్ చేస్తారని.. ఎక్స్‌ట్రార్డనరీ నటి అంటూ చెప్పారు. 
 
వేరే ఏదైనా ఫంక్షన్‌లో ఇంకో హీరో పేరు చెబితే కనుక మీకు కచ్చితంగా ఫోన్‌ చేస్తానంటూ నవ్వేశారు. అందుకు హరితేజ స్పందిస్తూ "ఏనీ సెంటర్‌ మీ పేరే" అనడంతో చప్పట్లు అదిరిపోయాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నమస్కారం తెలుగు ప్రజలారా.. నేను వీరమహాదేవిగా వస్తున్నా: సన్నీ

మంచు మనోజ్‌తో సన్నీ లియోన్ కరెంట్ తీగలో కనిపించిన సన్నీ లియోన్.. ఆపై రాజశేఖర్ గరుడ వేగలో ...

news

''భాగమతి''లో రాజకీయ నాయకురాలిగా దేవసేన..

సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ...

news

సమంత నిర్ణయం, పొంగిపోతున్న నాగ్ - అమల.. ఏంటది?

మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఆ మాటలను అందాల తార సమంత మాటల రూపంలో కాకుండా చేతల ...

news

దిల్ రాజు వెంటపడ్డ అనుపమ.. ఎందుకు?

నిర్మాత దిల్ రాజుకు అదృష్టం బాగా కలిసొచ్చినట్లుంది. ఏ సినిమా చేసినా సూపర్ హిట్టే. తను ...

Widgets Magazine