విందు పార్టీలో మందుకొట్టి చిందేసిన నటీమణులు (వీడియో)

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (09:28 IST)

Khushboo

టాలీవుడ్‌లో వెండితెర అరంగేంట్రం చేసి ఆపై కోలీవుడ్‌ను ఓ ఊపువూపిన హీరోయిన్ ఖుష్బూ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఒకపుడు తన అందచందాలతో ఆరబోసిన ఈ భామ ఇపుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అపుడపుడూ వెండితెరపై కనిపిస్తోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో కూడా ఓ కీలక పాత్రను పోషించింది. 
 
అయితే, ఇటీవల చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన విందు కార్యక్రమంలో సహచర నటి సుకన్యతో కలిసి పాల్గొంది. అలాగే, మరికొందరు తమిళ నటీనటులు కూడా పాల్గొన్నారు. ఇందులో సుకన్య, ఖుష్బూలు మందేసి చిందేస్తున్న వీడియో ఒకటి లీక్ అయింది. వీరిద్దరూ మద్యం మత్తులో సూపర్ హిట్ హిందీ సాంగ్‌ 'పియా తూ అబ్‌ తో ఆజా' పాటకు స్టెప్పులేశారు. 
 
కాస్తంత వయసు మీదపడినా ఇద్దరూ తగ్గలేదు. వీరిద్దరి పక్కనే ప్రముఖ నటుడు మనోబాల కూడా ఉన్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఇద్దరి స్టెప్పుల్లో గ్రేస్ తగ్గలేదని అభినందిస్తూనే, మందు కొట్టి ఇదేం పనని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

 దీనిపై మరింత చదవండి :  
ఖుష్బూ సుకన్య కోలీవుడ్ చిత్రపరిశ్రమ పవన్ కళ్యాణ్ Suganya Relaxing Mode Actress Kushboo Actor Director Manobala

Loading comments ...

తెలుగు సినిమా

news

'సత్య గ్యాంగ్‌' సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తారట...

సమాజంలో అనాధలనేవారు లేకుండా చేయాలనే సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందిన చిత్రం 'సత్య ...

news

'తొలిప్రేమ'కు 100 మార్కులు వేసిన దర్శకధీరుడు

దర్శకుడు రాజమౌళి తీసే సినిమాలనే చాలా మంది మెచ్చుకుంటుంటారు. బాలీవుడ్ తరహాలో సినిమాలను ...

news

అప్పుడే పెళ్ళా... ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది..

తన బాయ్ ఫ్రెండ్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పెళ్ళి దాకా తెచ్చుకుంది శృతి హాసన్. పెళ్ళి ...

news

ఆ హీరోయిన్లు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేష్ ఎంతో తెలుసా?

సాధారణంగా సినీ హీరో లేదా హీరోయిన్‌కు అయినా సరే ఒకే ఒక్క హిట్ పడితే చాలు.. వారు తమ ...