Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ఘటన గురించి తల్చుకుంటేనే రక్తం మరుగుతోంది.. ఆగ్రహోదగ్ర లక్ష్మీ మంచు

హైదరాబాద్, సోమవారం, 20 మార్చి 2017 (04:04 IST)

Widgets Magazine

మలయాళ హీరోయిన్ విషయంలో జరిగిన వేధింపు గురించి తల్చుకుంటేనే రక్తం మరుగుతోందని సినీ నటి, యాంకర్ మంచు లక్ష్మి అంటున్నారు. ఆమె ధైర్యం కొన్నివేలమంది ఆడవాళ్లకి ధైర్యాన్నిచ్చింది. కానీ అక్కడేదో జరిగినా ఇక్కడ మాలాంటి వాళ్లకు డ్రైవర్లంటేనే నమ్మకం పోయిందంటున్నారు. అయితే ఎక్కడో ఏదో జరిగిందని అమ్మాయిల‌ను ఇంట్లోనే ఉండ‌మ‌ని చెప్ప‌కండి. వారిలో మ‌రింత ధైర్యం నింపి స‌మాజంలోకి పంపండి అంటున్నారీమె. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.
 
ఈ రోజు ఒక న‌టికి మ‌ల‌యాళంలో ఏదో అయిందంటే ఇక్క‌డ ఉన్న మేం డ్రైవ‌ర్లని న‌మ్మ‌లేని ప‌రిస్థితి చోటుచేసుకుంది. కార‌ణం భ‌యం. కానీ ఈ ఆలోచ‌న‌ల్లో మార్పు రావాలంటాను నేను. ఇలాంటివి జ‌రుగుతాయ‌ని తెలిసిన‌ప్పుడు అమ్మాయిలు ఇంకాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాలి. పెప్ప‌ర్ స్పే ద‌గ్గ‌రుంచుకోవాలి. స‌ర్వం డిజిట‌ల్ మ‌యం అవుతున్న నేటి త‌రుణంలో ఆ టెక్నాల‌జీని భ‌ద్ర‌త కోసం ఉప‌యోగించుకోవాలి అంటాను.
 
అప్పుడు కాదు ఇప్పుడు ఆ విష‌యం అనుకున్నా రక్తం మ‌రుగుతోంది. హ్యాట్సాఫ్ టు ద‌ట్ యాక్ట్రెస్‌. త‌న ధైర్యం కొన్ని వేల మంది ఆడ‌వాళ్ల‌కి ధైర్యాన్నిచ్చింది. ఆ సంద‌ర్భంగా నేను మ‌గ‌వారిని కోరుకుంటున్న‌ది ఒక్క‌టే... ఎక్క‌డో ఏదో జ‌రిగింద‌ని అమ్మాయిల‌ను ఇంట్లోనే ఉండ‌మ‌ని చెప్ప‌కండి. వారిలో మ‌రింత ధైర్యం నింపి స‌మాజంలోకి పంపండి. అలాగే త‌ల్లులు త‌మకు పుట్టిన మ‌గ‌పిల్ల‌ల‌కు చాలా నేర్పించాలి. ఆడ‌వాళ్లప‌ట్ల వాళ్లు ఎలా ప్ర‌వ‌ర్తించాలో నేర్ప‌గ‌ల‌గాలి. అప్పుడే ప్ర‌కాశ‌వంత‌మైన స‌మాజాన్ని చూడ‌గ‌లుగుతాం.
 
అస‌లు మ‌హిళ‌లు మ‌గ‌వారిక‌న్నా దేనిలో త‌క్కువ‌ని ప్ర‌త్యేకంగా మ‌హిళా దినోత్స‌వాలు జ‌రుపుకోవాలి చెప్పండి? మ‌హిళ‌లు లేక‌పోతే ఇంకో జ‌న‌రేష‌న్ కూడా ఉండ‌దు క‌దా. అలాంట‌ప్పుడు సొసైటీ ఎందుకు సెప‌రేట్ చేస్తుంది ఆడ అని, మ‌గ అని... ఆడ‌వాళ్ల క‌ష్టాలు ఆడ‌వారికి ఉంటే, మ‌గ‌వాళ్ల క‌ష్టాలు మ‌గ‌వారివి. అందువ‌ల్ల ఇలాంటివాటిని నేను ప‌ట్టించుకోను.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను కంపోజ్ చేసిన పాటలు పాడొద్దు.. బాలుకు ఇళయరాజా నోటీసులు

తాను కంపోజ్ చేసిన పాటలను అంతర్జాతీయ వేదికలమీద తన అనుమతి లేకుండా పాడకూడదని ప్రముఖ సంగీత ...

news

బాహుబలి పార్ట్ 3 వస్తుందా? బుద్ధిపుడితే సీక్వెల్ తీసేస్తాడట..

బాహుబలి సినిమా తొలి పార్ట్ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 ట్రైలర్ ...

news

శ్రీమంతుడుకి సీక్వెల్ రాబోతుందా? భరత్ అను నేను టైటిల్ ఫిక్స్ చేస్తారా?

ఊరికోసం ఏదైనా చేయాలనే కాన్సెప్టుతో వచ్చిన మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా తర్వాత గ్రామాలను ...

news

చిరంజీవే హీరో నేను కాదు : 'కాటమరాయుడు'లో పవన్‌

''ఫంక్షన్‌లకు వెళ్ళాలంటే భయమేసేది. ఎందుకంటే చిరంజీవిగారే హీరో.. నేను కాదు... నేను చేసిన ...

Widgets Magazine