'రెడ్డి' అనే పదం మోయడం బరువుగా వుంది.. ఇకపై నా పేరు శ్రీశక్తి : శ్రీరెడ్డి

శనివారం, 14 ఏప్రియల్ 2018 (16:25 IST)

హైదరాబాద్ నడిబొడ్డున అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి మరోమారు వార్తలకెక్కనున్నారు. తన పేరును శ్రీరెడ్డి నుంచి శ్రీశక్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ రోజు నేను ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నాను.. అదేంటంటే నా పేరులో 'రెడ్డి' అని ఉన్న పదాన్ని మోయడం బరువుగా అనిపిస్తోంది.. నా పేరు ఇక నుంచి శ్రీరెడ్డి కాదు శ్రీశక్తి.. నా గురించి మీడియా రాసేటప్పుడుగానీ, చదివేటప్పుడుగానీ శ్రీశక్తి అనే రాయండి, చదవండి' అని నటి శ్రీరెడ్డి విజ్ఞప్తి చేసింది.
sri reddy
 
అంతేకాకుండా, నిర్మాత 'దిల్‌' రాజు చేతుల్లోంచి ఎప్పుడైతే థియేటర్లు బయటకు వస్తాయో అప్పటివరకు నేను శ్రీశక్తిగానే ఉంటాను. ఎవరి దగ్గరయితే మెజారిటీ థియేటర్లు ఉండిపోయాయో వారందరి చేతుల నుంచి బయటపడాలి. నేను చేసే ఉద్యమం ఇంత ఉద్ధృతం అవుతుందని నేను ఊహించలేదు. ఇంకొంత మంది అమ్మాయిలు బయటకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఓయూ విద్యార్థులను కలుపుకువెళతాము. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా చేస్తాం' అని ఆమె ప్రకటించారు. దీనిపై మరింత చదవండి :  
పేరు శ్రీశక్తి క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ Name Sri Sakthi Name Change శ్రీరెడ్డి Sri Reddy

Loading comments ...

తెలుగు సినిమా

news

సావిత్రిని తీసిపెట్టిన కీర్తి సురేష్ : మే 9న 'మహానటి' మూవీ రిలీజ్

అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రం ...

news

'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో'.. అల్లు అర్జున్ (Lyrical Song)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా వక్కంతం వంశీ ...

news

ప్రియాంకా నటించిన మరో హాలీవుడ్ చిత్రం - ట్రైలర్

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో కూడా అదరగొడుతోంది. ఈమె గతంలో నటించిన ...

news

దేవుడు లేడు.. దెయ్యాలే ఉన్నాయంటున్న ప్రియ‌ద‌ర్శ‌న్

ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫా బానోపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం ...