Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బిగ్ బాస్ సీరియస్ షిట్: వర్థమాన నటి వ్యాఖ్యలపై తీవ్రదుమారం

హైదరాబాద్, మంగళవారం, 18 జులై 2017 (03:50 IST)

Widgets Magazine

ఒక అంతర్జాతీయ స్థాయి సీరియల్ షో పరిచయ కార్యక్రమం మాత్రమే తెలుగులో మొదలైంది. అప్పుడే దానిపై తీవ్రమైన విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు, బిగ్ బాస్ హోస్ట్ జూనియర్ ఎంటీఆర్‌పై చెణుకులు.. ఎందుకిలా జరుగుతోంది? ఇంగ్లీషులోనూ, హిందీలోనూ జరిగిన విధంగా కాకుండా పెద్ద సెలబ్రిటీల జోలికి పోకుండా సహాయ నటులు, గాయనిలు, సినీరంగ విమర్సకులు వంటి సాధారణమైన వ్యక్తులను పనిగట్టుకుని ఎందుకు బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకుని షో చేయాలనే ధైర్యానికి దిగారు అనేది నిర్వాహకులు చెబితే గానీ ఎవరికీ తెలియదు. మరి ఈ ప్రోగ్రం తెలుగు వెర్షన్ ఉద్దేశం ఇంకా బోధపడకుండానే ఇది ఫెయిల్ అని, దీన్ని చూడటం కంటే ప్లగ్ లో వెలుపెడితే మంచిదని వ్యాఖ్యలు చేయడంలో ఏదో పక్షపాతం పొడసూపుతున్నట్లు కనిపించడం లేదా.. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి సిద్దమై వచ్చిన వారి ప్రదర్సన ఒక్క షో కూడా చూడకుండానే అప్పుడే కామెంట్లు మొదలెట్టడం న్యాయం కాదని కొందరి వ్యాఖ్య
 
ఈలోపల యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ షోపై వర్ధమాన నటి ఫేస్‌బుక్‌లో ఒకింత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ షోలో తను భాగం కాకపోవడం ఆనందం కలిగిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. 'సీరియస్ షిట్‌' అంటూ ఆమె బిగ్‌బాస్‌ షో తొలి ఎపిసోడ్‌ పూర్తయిన తర్వాత ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ 'కాటమరాయుడు'లో శివబాలాజీ సరసన, దర్శకుడు వంశీ 'ఫ్యాషన్‌ డిజైనర్‌'లో నటించిన ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. 
 
ఎన్టీఆర్‌ అభిమానులు ఆమెను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. అయితే, తన పోస్టును సమర్థించుకున్న ఆమె తాను ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానినని తెలిపారు. 'ఆయన డ్యాన్స్‌ అద్భుతంగా ఉంటుంది. ఇది ఆయన పనిని పరిహసించడం  కాదు' అని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ షోపై తన పోస్టును తొలగించే ప్రసక్తి లేదన్న ఆమె.. ఎన్టీఆర్‌ను కించపరిచిందంటూ తన పోస్టును వక్రీకరించొద్దంటూ సూచించారు.
 
విమర్శించడం లేదంటూనే బిగ్‌బాస్‌ షోలో తను భాగం కాకపోవడం ఆనందం కలిగిస్తున్నదని పేర్కొనడంలో మతలబు ఏమిటో మరి. ఆమెను ఈ కార్యక్రమంలోకి తీసుకోలేదని బాధతో, ఈర్ష్యతో అంటోందని ఎవరైనా అంటే ఎలాగుంటుంది. సెలెబ్రటీలు తప్పితే సగటు మనుషులు భారీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అర్హులు కారా.. ఇదేదో వివక్షకు సంబందించిన విషయంలా మారేటట్టుంది. షో మొదలయ్యాక రెండు మూడు వారాలు గడిస్తే అప్పుడు దానిపై ఒక అభిప్రాయానికి రావడమే సమంజసం కాదా..
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సో... పూరీ మత్తుమందు పీడితుడేనన్నమాట... 19న సిట్ ముందుకు...

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది తొలుత తమకు నోటీసులు అందలేదని ...

news

డ్రగ్స్ కేసులో రానా, అభిరామ్ పేర్లా? పిచ్చి పుకార్లంటూ...

డ్రగ్స్ కేసులో పలువురు సినిమా నటీనటుల పేర్లు వస్తుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం ...

news

టాలీవుడ్‌లో డ్రగ్స్ బాబులు... కొత్తగా మందుబాబు నాని షూటింగ్‌కు అలా వచ్చేశాడట...

నాని హీరోగా నటించి, విడుదలైన చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి మంచి ...

news

చెర్రీ మూవీకి రూ.14 కోట్లు డిమాండ్ చేసిన కొరటాల శివ?

కొరటాల శివ... టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరు. వరుస విజయాలు ఆయన సొంతం. కథా రచయితగా ...

Widgets Magazine