శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (14:12 IST)

కాసుల వర్షం కురిపిస్తున్న ‘యే దిల్‌ హై ముష్కిల్‌’... 4 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి

అనేక వివాదాల నడుమ వెండితెరపై ప్రదర్శితమైన చిత్రం ‘యే దిల్‌ హై ముష్కిల్‌’. ఈ చిత్రం విడుదలకు ముందు ప్రచారంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే.. చిత్రం విడుదలైన తర్వాత సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఫలిత

అనేక వివాదాల నడుమ వెండితెరపై ప్రదర్శితమైన చిత్రం ‘యే దిల్‌ హై ముష్కిల్‌’. ఈ చిత్రం విడుదలకు ముందు ప్రచారంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే.. చిత్రం విడుదలైన తర్వాత సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత శుక్రవారం విడదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లక్లబ్‌లో చేరిపోయింది. 
 
భారత్‌లో ఈ చిత్రం రూ.76 కోట్లకు పైగా వసూలు చేయగా ఓవర్‌సీస్‌లో 6.55 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.121.21 కోట్ల బిజినెస్‌ చేసి 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆరో చిత్రంగా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ వెల్లడించింది.
 
యురీ ఘటన నేపథ్యంలో పాక్‌ నటులు భారత్‌ వదిలి వెళ్లిపోవాలని, వారి సినిమాలను భారత్‌లో విడుదల చేయనివ్వమని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన హెచ్చరించింది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల విషయమై దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌.. నిర్మాతల బృందం హోంమంత్రి రాజ్‌నాథ్‌తో పాటు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రేలతో కలిసిచర్చించిన విషయం తెల్సిందే. ఆ తర్వాతే ఈ చిత్రం విడుదలకు నోచుకుంది.