అజ్ఞాతవాసి సాంగ్ మేకింగ్ వీడియో

మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:12 IST)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ వద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. 
 
ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, కీర్తీ సురేష్, అనూ ఇమ్మానుయేల్, ఆది, కుష్బూ, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం సంక్రాంతికి కానుకగా పవన్ అజ్ఞాతవాసి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 
ఇకపోతే.. అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ముందే రికార్డుల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం విడుదల కానన్ని స్క్రీన్‌లలో విడుదల కాబోతోంది. ఏకంగా 249 ప్రాంతాల్లో విడుదల కానుంది. మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో వెల్లడించింది.  
 దీనిపై మరింత చదవండి :  
Agnathavasi Pspk 25 Trivikram Keerthy Suresh Pawan Kalyan Song Making Video

Loading comments ...

తెలుగు సినిమా

news

అర్జున్ రెడ్డికే లిప్ కిస్ ఇచ్చాను.. విజయ్ దేవరకొండకు కాదు: షాలినీ పాండే

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే లిప్ లాక్‌పై స్పందించింది. తాజాగా 100% లవ్ తమిళ ...

news

జబర్దస్త్ హాస్యంపై విరుచుకుపడ్డ రాజేంద్రప్రసాద్

కామెడీ అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. జంధ్యాల, రేలంగి నరసింహారావు, బాపు, సింగీతం శ్రీనివాసరావు ...

news

రిలీజ్‌కు ముందే 'అజ్ఞాతవాసి' రికార్డు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ...

news

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, ఓవర్సీస్‌లో బాహుబలిని వణికిస్తున్నాడా? ఇదీ లెక్క

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ...