గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 23 జులై 2016 (12:44 IST)

'కబాలి' ఆట... 'గాలి'లో మాట తప్పిన ఎయిర్ ఏసియా, 'నేల'పై నిలబెట్టుకున్న కిరణ్ బేడీ

కబాలి సినిమా మానియా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత గవర్నర్ చేత కూడా ఆశ్చర్యకరమైన పని చేయించింది. స్వయంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కబాలి సినిమా టెకెట్లను ప్రజలకిచ్చి మూవీ చూడమని చెప్పిన ఘటన పాండిచ్చేరిలో జరిగింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బీజేపీ పార్టీ తరుపున

కబాలి సినిమా మానియా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత గవర్నర్ చేత కూడా ఆశ్చర్యకరమైన పని చేయించింది. స్వయంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కబాలి సినిమా టెకెట్లను ప్రజలకిచ్చి మూవీ చూడమని చెప్పిన ఘటన పాండిచ్చేరిలో జరిగింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బీజేపీ పార్టీ తరుపున ఎంపికైన కిరణ్ బేడి పాండిచ్చేరిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె ప్రజలను అభివృద్ది వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు. 
 
అందులో భాగంగా సొంత ఇళ్లల్లో టాయిలెట్లు కట్టించుకున్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం కబాలి ప్రభావం దక్షిణ భారతం మొత్తం ఆవహించి ఉందన్న విషయాన్ని గుర్తించిన ఆమె అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. సొంత ఇళ్లలో టాయిలెట్లు కట్టించుకున్న వారికి ప్రోత్సాహకంగా కబాలి టెకెట్లు ఇచ్చారు. కబాలి మానియా దాదాపు దక్షిణ భారతదేశమంతటా వైరల్‌గా ఉంది. తమిళనాడు, పాండిచ్చేరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఈ ప్రజల్లో ఉండే ఈ క్రేజ్‌ను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ విధంగా వినియోగించారు.
 
ఇకపోతే మా విమానం ఎక్కండి... కబాలి చిత్రాన్ని చూడండి అంటూ ఊదరగొట్టిన ఎయిర్ ఏసియా మాట తప్పింది. తమ విమానాల్లో ప్రయాణించేవారికి కబాలి సినిమా టిక్కెట్లు ఇప్పిస్తామనీ, సినిమా చూశాక మళ్లీ గమ్యస్థానాలకు చేర్చుతామని చెప్పిన ఎయిర్ ఏసియా తన నాలుకను అడ్డంగా తిప్పేసింది. 'ఎయిర్ ఏషియా' కంపెనీ ఈ సినిమాను చూపించే ప్రదేశంతో పాటు సమయాన్ని కూడా రీషెడ్యూల్ చేసి ప్రయాణికులకు, రజినీకాంత్ అభిమానులకు షాక్ ఇచ్చింది. దీనితో తొలిరోజే కబాలి చిత్రాన్ని చూడాలనుకున్న ఎయిర్ ఏసియా ప్రయాణికుల ఆశలు గల్లంతయ్యాయి. కాగా ఈ పొరబాటుకు చింతిస్తున్నామనీ, నష్టపరిహారం చెల్లిస్తామని ఎయిర్ ఏసియా చెపుతోంది. కానీ మొదటి బంచ్‌లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా... కదా...!!