గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (10:30 IST)

రెహ్మాన్ పాడుతుంటే.. ఐశ్వర్యారాయ్ స్టెప్పులేస్తే.. కేకే..!

ఏంటి రెహ్మాన్‌ పాటకు ఐశ్వర్యారాయ్ స్టెప్పులేయనుందా? ఎక్కడ? ఎప్పుడు? అని తెలుసుకోవాలని ఉంది కదూ.. అయితే చదవండి. ఏఆర్‌ రెహ్మాన్‌ స్టేజ్‌ షోలో పాడుతుంటే.. ఆ పాటకు ఐశ్వర్యారాయ్‌ స్టెప్పలు వేస్తే.. కేకే. ఇలాంటి కల.. నిజం కాబోతోంది. దీనికి చెన్నై వేదిక కాబోతోంది. అక్టోబర్‌ 3 నుంచి చెన్నైలో పుట్‌బాల్‌ లీగ్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌ల ప్రారంభానికి సెలబ్రిటీలను ఆహ్వానించాలని నిర్ణయించారు. 
 
అయితే, ఏదో తూతూమంత్రంగా కాకుండా.. ఈ లీగ్ ప్రారంభోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని భావించారు. ఇందుకోసం ఏఆర్‌ రెహ్మాన్‌ను, ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించారు. కాల్షీట్స్‌ అడ్జస్ట్‌ అయితే.. వీరిద్దరూ ఒకేరోజు, ఒకేచోట కనిపించి.. అభిమానులను ఖుషీ చేయటం ఖాయమని టోర్నీ నిర్వాహకులు అంటున్నారు. అన్నీ కుదిరితే.. రెహ్మాన్-ఐష్‌ల కాంబినేషన్‌లో పాట-ఆట అదిరిపోద్దని సినీ పండితులు అంటున్నారు.