లైవ్ షోలో స్టేజ్‌పై ఆడిపాడిన ఐష్.. దద్దరిల్లిన ఆడిటోరియం (Video)

బుధవారం, 11 జులై 2018 (18:56 IST)

బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ స్టేజ్‌పై అదరగొట్టింది. ఆడుతూ పాడుతూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. దీంతో అభిమానులు సందడి అంతా ఇంతాకాదు. కేకలు, ఈలలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదులేండి. రీల్ లైఫ్‌లోనే  సుమా.
aish in fanney khan
 
అతుల్ మంజ్రేకర్ తెరకెక్కిస్తున్న "ఫన్నేఖాన్" చిత్రంలో ఐష్ ఓ ముఖ్యపాత్రను పోషిస్తోంది. ఇందులో పాప్ సింగర్‌గా కనిపిస్తోంది. లైవ్ షో ఈవెంట్‌లో భాగంగా ఆడియన్స్ ముందు స్టేజ్‌పై ఆడి పాడిన ఐష్‌ని చూసి అభిమానులు గంతులు వేశారు. 'మోహబ్బత్' అనే ఈ పాటకి ఐష్ స్టెప్స్ వేయగా, ఈ పాటకి ఫ్రాంక్ గాట్సన్ కొరియోగ్రఫీ అందించారు. చిత్రంలో ఐష్ పాత్రని బట్టే ఈ సాంగ్ డిజైన్ చేసామని దర్శకుడు చెబుతున్నాడు. 
 
ఇకపోతే, 'ఫన్నేఖాన్' చిత్రంలో అనీల్ కపూర్, రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. మంచి గాయకుడు కావాలనే కోరిక తీర్చుకోలేని తండ్రి పాత్రలో అనీల్ కపూర్ నటించారు. వచ్చే నెల మూడో తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాహుల్‌ను కలిసిన 'కాలా' దర్శకుడు... ఎందుకు?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కాలా" చిత్రానికి ...

news

మ‌హేష్ మూవీ ఫ‌స్ట్ లుక్‌కి ముహుర్తం ఫిక్స్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ...

news

ఈనెల 28న మెగా డాటర్ నీహారిక 'హ్యాపి వెడ్డింగ్'.. వరుడు అతనే...

మెగా డాటర్ నీహారిక "వెడ్డింగ్" ఈనెల 28వ తేదీన జరుగనుంది. 'వెడ్డింగ్' అంటే.. ఆమె పెళ్లి ...

news

ఎట్ట‌కేల‌కు ర‌జ‌నీ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రోబో సీక్వెల్ 2.0 ...