శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 మే 2016 (17:21 IST)

కేన్స్ ఉత్సవంలో పర్పుల్ కలర్ లిప్ స్టిక్: ఐష్ అందుకే అలా చేసిందా?

ఐశ్వర్యారాయ్ పర్పుల్ కలర్ లిప్ స్టిక్ వేసుకుందని రచ్చ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఐష్ తాను వేసుకున్న లిప్‌స్టిక్‌ గురించి అందరూ మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే అలా చేసిందని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అంటోంది. దీంతో నెటిజన్లు షాక్ తిన్నారు. పబ్లిసిటీ కోసమే ఐష్ ఇలా చేసిందా అంటూ మరికొందరు అంటున్నారు. 
 
ఇంతకీ విశేషం ఏమిటంటే..? మాజీ సుందరి, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ కేన్స్ ఉత్సవంలో పర్పుల్ కలర్ లిప్‌స్టిక్ వేసుకుని అందరి నోట నానింది. కొందరు నెటిజన్లు పర్పుల్ కలర్ బావుందని చెప్తే.. మరికొందరు సెటైర్లు విసిరారు. 
 
దీనిపై సోనమ్ కపూర్ స్పందిస్తూ.. ఐష్ అందరి దృష్టిని ఆకర్షించాలనే అలా చేసిందని చెప్పింది. అందరూ తన లిప్‌స్టిక్ గురించి మాట్లాడుకోవడానికే ఐష్ పర్పుల్ కలర్ లిప్‌స్టిక్ వేసుకుందని సోనమ్ క్లారిటీ ఇచ్చింది. ఫ్యాషన్, మేకప్‌ల ముఖ్య ఉద్దేశం దాని గురించి నలుగురు చర్చించడమేనని, తనకు తెలిసి.. ఐశ్వర్య కూడా లిప్ స్టిక్ గురించి అందరూ చర్చించుకోవాలనే ఉద్దేశంతో అలా చేసివుంటారని చెప్పుకొచ్చింది. మరి అదన్నమాట.. ఐష్ పర్పుల్ కలర్ లిప్ స్టిక్ కథ..!