బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2015 (15:23 IST)

''Jazbaa'' కోసం పాట పాడుతున్న మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తన లేటెస్ట్ సినిమా జజ్బా కోసం పాట పాడనుంది. ప్రపంచ సుందరిగా ప్రేక్షకుల మన్ననలు పొంది అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడి.. ఆరాధనకు జన్మనిచ్చి తల్లిగా మారిన ఐశ్వర్యారాయ్‌కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఐశ్వర్యారాయ్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే జజ్బా చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టే ఐశ్వర్యారాయ్.. ఈ చిత్రం కోసం ఓ పాట కూడా పాడనుంది. డైరక్టర్ సంజయ్ గుప్తా విజ్ఞప్తి మేరకు మాజీ ప్రపంచ సుందరి తొలిసారిగా పాట పాడి శ్రోతలను కూడా అలరించనుంది. ఇప్పటికే పాపులర్ మ్యూజిక్ డైరక్టర్స్‌తో జజ్బా పాటల్ని సమకూర్చారు. ఇందులో ఐష్ పాటకు కూడా ప్రత్యేక స్థానముందని చిత్ర యూనిట్ తెలిపింది. సాంగ్ షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.